ఏపీ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా ‘ఘంటా’

Update: 2018-12-03 03:07 GMT

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా సీనియర్‌ న్యాయవాది ఘంటా రామారావు ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో 26 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చైర్మన్‌ పదవికి ఘంటా రామారావు, కృష్ణారెడ్డిలు పోటీపడ్డారు. అయితే కృష్ణారెడ్డిపై నాలుగు ఓట్ల మెజారితో రామారావు గెలుపొందారు. ఆయనకు 15 ఓట్లు రాగా..  కృష్ణారెడ్డికి 11 ఓట్లు వచ్చాయి. దాంతో రామారావు బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.  అలాగే వైస్‌ చైర్మన్‌గా రామజోగేశ్వరరావు (విశాఖ) విజయం సాధించారు. ఇక బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులుగా ఆలూరు రామిరెడ్డి(అనంతపురం) ఎన్నికయ్యారు. వీరంతా ఐదేళ్లపాటు ఆయా పదవుల్లో ఉంటారు. కాగా, చైర్మన్‌గా ఎన్నికైన ఘంటా రామారావు స్వస్థలం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం జాలాది గ్రామం. విశాఖలోని ఆళ్వార్‌దాస్‌ లా కళాశాలలో న్యాయశాస్త్ర పట్టా పొందారు. 34 ఏళ్ల నుంచి ఆయన హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 

Similar News