జగన్‌పై దాడి కేసును సీఎం, డీజీపీ నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. దాడి జరిగిన తర్వాత శ్రీనివాస్‌ను సీఐఎస్‌ఎఫ్ కస్టడీకి తీసుకుని విచారిస్తే.. కోడిపందాల కత్తి తప్పు ఇంకేమీ దొరకలేదు. స్టేట్ పోలీస్‌లకు అప్పగించాక 10 పేజీల లేఖ వచ్చిందని, అది ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై జరిగిన దాడిని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అర్ధమవుతుందన్నారు. అందుకే థర్డ్ పార్టీతో కేసు విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.