Government Scheme: రూ.5వేల పెట్టుబడితో.. చేతికి రూ.42 లక్షలు.. ప్రభుత్వ గ్యారెంటీతో భారీ లాభాలు.. ఆ స్కీం పూర్తి వివరాలు..!
PPF Scheme Latest Update: PPF స్కీమ్‌లో రూ.42 లక్షలు పొందవచ్చు. అవును.. ప్రభుత్వ గ్యారంటీతో పాటు మనీ సెక్యూరిటీ కూడా ఇందులో లభిస్తుంది. దీంతో అందరికీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.
Public Provident Fund Scheme: కేంద్ర ప్రభుత్వ పీపీఎఫ్ స్కీమ్‌పై ప్రజల్లో చాలా క్రేజ్ కనిపిస్తోంది. ఇది ప్రభుత్వం అందించే అద్భుతమైన పథకం. దీనిలో పెట్టుబడిదారులు ఒకేసారి లక్షల రూపాయల నిధిని పొందే ఛాన్స్ ఉంది. PPF స్కీమ్‌లో రూ.42 లక్షలు పొందవచ్చు. అవును.. ప్రభుత్వ గ్యారంటీతో పాటు మనీ సెక్యూరిటీ కూడా ఇందులో లభిస్తుంది. దీంతో అందరికీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.
పెట్టుబడికి పీపీఎఫ్ బెస్ట్ ఆప్షన్..
దీర్ఘకాలానికి అనుగుణంగా డబ్బును పెట్టుబడి పెట్టడానికి PPF పథకం ఉత్తమ ఎంపిక. ఇందులో మీరు ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో మీకు చక్రవడ్డీ సదుపాయం లభిస్తుంది. వీటితో పాటు మార్కెట్‌లోని హెచ్చు తగ్గులు ఇలాంటి ప్రభుత్వ పథకాలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు.
మీరు PPF పథకంలో ప్రతి నెలా రూ.5000లు పెట్టుబడి పెడితే రూ.42 లక్షలు పొందడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.. అంటే ఏడాది పొడవునా మీ పెట్టుబడి రూ.60,000లుగా ఉండాలి. మీరు దీన్ని 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీలో మీ డబ్బు రూ.16,27,284లు అవుతుంది. మీరు మరో 5 సంవత్సరాల వ్యవధిలో తదుపరి 10 సంవత్సరాలకు డిపాజిట్‌ని పొడిగిస్తే, 25 సంవత్సరాల తర్వాత మీ ఫండ్ దాదాపు రూ.42 లక్షలు (రూ. 41,57,566) అవుతుంది. ఇందులో మీ సహకారం రూ. 15,12,500లు అన్నమాట. అంటే వడ్డీ ఆదాయం రూ. 26,45,066లు అవుతుంది.
ఖాతా తెరవడం ఎలా?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో కనీసం రూ. 500తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. మీరు దీన్ని మీ దగ్గరలోని పోస్టాఫీసు లేదా బ్యాంక్ నుంచి ఎక్కడైనా తెరవవచ్చు. జనవరి 1, 2023 నుంచి ప్రభుత్వం ఈ పథకంలో 7.1 శాతం వడ్డీ ప్రయోజనాన్ని అందిస్తోంది. PPF పథకం మెచ్యూరిటీ 15 సంవత్సరాలలో ఉంటుంది.
మెచ్యూరిటీ తర్వాత ఈ పథకంలో ఖాతాదారులు మరో 10 సంవత్సరాలు పెంచుకునే ఛాన్స్ ఉంది. అయితే, ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే లోన్ కోసం కూడా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది. మీరు PPF పథకంలో పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఈ పథకంలో, మీరు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకంలో వడ్డీ ద్వారా వచ్చే మొత్తం కూడా పన్ను రహితం. ఈ పథకంలో 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, మీరు లోన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.