Marriage Loan: పెళ్లి ఖర్చులకి డబ్బులు లేవా.. రూ.25 లక్షల వరకు లోన్‌..!

Marriage Loan: జీవితంలో పెళ్లి ఒక్కసారే చేసుకుంటారు. అందుకే చాలామంది వైభవంగా చేసుకోవాలని ఆశపడుతారు.

Update: 2023-08-10 13:30 GMT

Marriage Loan: పెళ్లి ఖర్చులకి డబ్బులు లేవా.. రూ.25 లక్షల వరకు లోన్‌..!

Marriage Loan: జీవితంలో పెళ్లి ఒక్కసారే చేసుకుంటారు. అందుకే చాలామంది వైభవంగా చేసుకోవాలని ఆశపడుతారు. ఇందుకోసం చాలాచోట్ల అప్పులు చేస్తారు. అయినప్పటికీ వారు అనుకున్నవిధంగా పెళ్లి జరగదు. ఇలాంటి వారికి కొన్ని బ్యాంకులు మంచి అవకాశాన్ని అందిస్తున్నాయి. పెళ్లికోసం ఏకంగా రూ.25 లక్షల వరకు రుణాలని అందిస్తున్నాయి. కారులోన్, హౌజ్‌లోన్‌ మాదిరిగానే పెళ్లిలోన్‌ కూడా అందిస్తున్నాయి. దీనిని ఏ విధంగా పొందాలో ఈరోజు తెలుసుకుందాం.

ఇటీవల బ్యాంకులు పెళ్లి ఖర్చుల కోసం కూడా రుణం అందిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు ఎక్కువగా లోన్స్‌ను తక్కువ వడ్డీ రేట్లకు అందిస్తుంటాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా క్రెడిట్ స్కోర్, బ్యాంకులో ఆయా ఖాతాదారులు నిర్వహించే ఖాతాలను బట్టి రుణం అందిస్తాయి. పర్సనల్ లోన్ అన్-సెక్యూర్డ్ కాబట్టి వడ్డీ రేటు ఎక్కువ. హోమ్ లోన్, కారు లోన్ సెక్యూర్డ్ లోన్ కాబట్టి వడ్డీ రేటు కొంచెం తక్కువగా ఉంటుంది.

పెళ్ళిళ్లకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సమయానికి తగినంత ఆదాయం లేని వారికి బ్యాంకులు పెళ్లి ఖర్చు కోసం రుణాలు అందిస్తాయి. ఇది పర్సనల్ లోన్ కిందకు వస్తుంది కాబట్టి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. మీ సౌలభ్యాన్ని బట్టి రుణం తీర్చుకోవచ్చు. కారు లోన్, హోమ్ లోన్ తీసుకుంటే చెక్ నేరుగా విక్రేతకు అందిస్తారు. కానీ వ్యక్తిగత రుణం మాత్రం నేరుగా మీ బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అవుతుంది. ఈ డబ్బును ఏ విధంగానైనా వినియోగించుకోవచ్చు. వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేటు 8.80 శాతం నుంచి 10.35 శాతం వరకు ఉంది.

Tags:    

Similar News