Car Buying Tips: చేతిలో చిల్లిగవ్వ లేకున్నాకారు కొనొచ్చు.. కానీ అది వీరికి మాత్రమే సాధ్యం..!

Car Buying Tips: జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక మంచి ఇల్లు, కొత్త కారు కొనుగోలు చేయాలని ఆశగా ఉంటుంది.

Update: 2024-05-02 15:30 GMT

Car Buying Tips: చేతిలో చిల్లిగవ్వ లేకున్నాకారు కొనొచ్చు.. కానీ అది వీరికి మాత్రమే సాధ్యం..!

Car Buying Tips: జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక మంచి ఇల్లు, కొత్త కారు కొనుగోలు చేయాలని ఆశగా ఉంటుంది. అయితే ఇవి అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ ఇల్లు గురించి పక్కనబెడితే కారు సులువుగా కొనుగోలు చేయవచ్చు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా సులువుగా కారు కొనొచ్చు. సాధారణంగా కొంత డౌన్‌ పేమెంట్‌ చెల్లించి బ్యాంకులు లేదా ఫైనాన్స్‌ కంపెనీల ద్వారా లోన్‌ తీసుకొని కారు కొంటారు. ఈ లోన్స్‌ని ఈఎంఐ పద్దతిలో క్లియర్‌ చేస్తారు. అయితే కొంతమంది జీరో డౌన్‌ పేమెంట్‌ ఆప్షన్‌తో ఒక్క రూపాయి చెల్లించకుండా పూర్తిగా లోన్‌ తీసుకొని కారు కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రాసెస్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చాలా కమర్షియల్ బ్యాంకులు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ ను అందిస్తాయి. దీన్ని కార్ వితౌట్ డౌన్ పేమెంట్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి ఆప్షన్స్ బ్యాంకులు తమ ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు మాత్రమే అందిస్తుంటాయి. వీటిని ప్రీ అప్రూవ్డ్ కార్ లోన్ ఆఫర్లుగా పేర్కొంటారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవాళ్లు లేదా అధిక ఆదాయంఉన్నవారు ఇలాంటి బెనిఫిట్స్ పొందుతారు. ఇలాంటి లోన్స్ ని ఏడేండ్ల వరకు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో లోన్ రీపేమెంట్ కూడా చేయవచ్చు. బ్యాంకులు ఇలాంటి లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి ఫైల్ ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తారు.

కార్ లోన్స్ కు సాధారణ వడ్డీ రేట్లు 8.75శాతం నుంచి 9శాతం ఉంటాయి. జీర్ డౌన్ పేమెంట్ ఆప్షన్ ను వినియోగించుకున్నప్పుడు వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాదాపు తొమ్మిది నుంచి 10శాతం వరకు ఉంటాయి. అయినప్పటికీ ఆఫర్ ఎక్స్ షోరూమ్ ధర, కారు రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ , ఇన్సూరెన్స్ సహా కొత్త కారుకొనుగోలుకు సంబంధించిన ఖర్చులను కవర్ చేస్తుంది. కానీ కారుకు యాడ్ చేసిన ఏవైనా అడిషినల్ యాక్సెసరీలను ఆఫర్ కవర్ చేయదు. వినియోగదా రులు వాటి కోసం జేబు నుంచి విడిగా చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News