ATM: ఏటీఎం నుంచి మనీ విత్‌ డ్రా మరింత సులువు.. గూగుల్‌ పే, పేటీఎం ఉంటే చాలు..!

ATM: సాధారణంగా ఎవరైనా డెబిట్‌ కార్డు లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా ఏటీఎం నుంచి మనీ విత్‌ డ్రా చేస్తారు.

Update: 2022-07-08 15:00 GMT

ATM: ఏటీఎం నుంచి మనీ విత్‌ డ్రా మరింత సులువు.. గూగుల్‌ పే, పేటీఎం ఉంటే చాలు..!

ATM: సాధారణంగా ఎవరైనా డెబిట్‌ కార్డు లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా ఏటీఎం నుంచి మనీ విత్‌ డ్రా చేస్తారు. కానీ ఇప్పుడు కార్డు అవసరం లేదు. కేవలం మొబైల్‌లో గూగుల్‌ పే, ఫోన్‌ పే ఉంటే చాలు. ఎన్‌సిఆర్ కార్పొరేషన్ దేశంలోని ప్రతి ఎటిఎం మెషీన్‌ను ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ఐసిసిడబ్ల్యు)తో అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించింది. దీనివల్ల కస్టమర్‌లు ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసిన యుపిఐ యాప్ ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అంటే వినియోగదారులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల సహాయం లేకుండా ఏటీఎం మెషీన్ల నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మీకు కార్డ్ లేనప్పుడు లేదా మీ కార్డ్ ఎక్కడో పోగొట్టుకున్నప్పుడు ఈ పద్దతి చాలా ఉపయోగపడుతుంది. యూపీఐ సాయంతో ఏటీఎం నుంచి డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలో తెలుసుకుందాం. అయితే ఈ సేవను ఉపయోగించడానికి ఏటీఎం మెషీన్ తప్పనిసరిగా యూపీఐ సేవను ప్రారంభించి ఉండాలని గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఫోన్ పే, అమెజాన్ పే, గూగుల్ పే లేదా పేటీఎం ఏదైనా యాప్ మీ ఫోన్‌లో ఉండటం అవసరం. మీ ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి.

ఇలా చేయండి..?

1. ఏదైనా ఏటీఎం మెషీన్‌కి వెళ్లి నగదు విత్‌డ్రా ఎంపికను ఎంచుకోవాలి.

2. తర్వాత ఏటీఎం మెషీన్‌లో చూపిన ఎంపిక నుంచి యూపీఐ ఎంపికను ఎంచుకోవాలి.

3. మీకు ఏటీఎం మెషీన్ స్క్రీన్‌పై QR కోడ్ కనిపిస్తుంది.

4. ఇప్పుడు మీ ఫోన్‌లో ఏదైనా యూపీఐ చెల్లింపు యాప్‌ని ఓపెన్‌ చేసి, దీంతో QR కోడ్‌ని స్కాన్ చేయాలి.

5.QR కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత మొత్తాన్ని నమోదు చేయండి. అయితే ప్రస్తుతం ఈ పరిమితి 5,000 వరకు మాత్రమే ఉంది.

6. యూపీఐ పిన్‌ని ఎంటర్‌ చేయడం ద్వారా చెల్లింపు పూర్తవుతుంది.

Tags:    

Similar News