Personal Loan: చౌకైన పర్సనల్‌ లోన్‌ ఎక్కడ పొందాలో తెలుసా..!

Personal Loan: మీకు అత్యవసర సమయంలో డబ్బులు అవసరమైతే మొదటగా గుర్తుకువచ్చేది పర్సనల్‌లోన్‌.

Update: 2021-11-27 03:03 GMT

చౌకైన పర్సనల్‌ లోన్‌ ఎక్కడ పొందాలో తెలుసా..! (ఫైల్ ఇమేజ్)

Personal Loan: మీకు అత్యవసర సమయంలో డబ్బులు అవసరమైతే మొదటగా గుర్తుకువచ్చేది పర్సనల్‌లోన్‌. కానీ ఇది సరైనది కాదు. ఎందుకంటే వడ్డీ ఎక్కువగా వసూలు చేస్తారు. డబ్బు వచ్చే మార్గాలు పూర్తిగా మూసుకుపోయినప్పుడు పర్సనల్‌ లోన్‌ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందుకోసం పేస్లిప్, ITR ఫారమ్, ఇతర లోన్ అప్రూవల్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.దరఖాస్తు అప్రూవల్‌ సాధించిన తర్వాత డబ్బు అకౌంట్లో జమకావడానికి రెండు నుంచి ఏడు రోజులు పడుతుంది. కొంతమంది రుణదాతలు వేగంగా పంపిణీ చేయవచ్చు. పర్సనల్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటమే. అయితే పర్సనల్‌ లోన్‌ తక్కువ వడ్డీకి ఏ బ్యాంకులు ఇస్తున్నాయో తెలుసుకుందాం.

1. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకోవడానికి 8.9% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో EMI రూ.10,355 చెల్లించాలి. సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా ఇదే వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. PNBలో ప్రాసెసింగ్ ఫీజులో తగ్గింపు ఉంది.

2. ఇండియన్ బ్యాంక్

ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్‌లో సరసమైన ధరలకు వ్యక్తిగత రుణాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులో వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు 9.05 శాతం. దీని EMI రూ.10,391కి వస్తుంది.

3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

చౌకైన వ్యక్తిగత రుణాలు ఇచ్చే జాబితాలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తర్వాతి స్థానంలో ఉంది. ఇందులో వ్యక్తిగత రుణంపై సంవత్సరానికి 9.45 శాతం వడ్డీ రేటు ఉంటుంది. బ్యాంక్ EMI రూ.10,489 అవుతుంది.

4. పంజాబ్ & సింధ్ బ్యాంక్, IDBI బ్యాంక్

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, IDBI బ్యాంక్ వ్యక్తిగత రుణాలపై 9.5 శాతం వడ్డీ రేటును కలిగి ఉన్నాయి. మీరు ఐదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటే ప్రతి నెలా రూ.10,501 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News