Home Loans: గృహ రుణాలపై ఏ బ్యాంకు తక్కువ వడ్డీ వసూలు చేస్తుంది.. EMI, ప్రాసెసింగ్‌ ఫీజు ఎంత..?

*యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) గృహ రుణాలపై వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

Update: 2021-11-19 08:28 GMT

గృహ రుణాలు (ఫైల్ ఫోటో)

Home Loans: గృహ రుణాల విషయంలో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వినియోగదారులకు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరుచేయడానికి ఈ పోటీ. తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) గృహ రుణాలపై వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు కనీస వడ్డీ రేటు 6.8 శాతానికి బదులుగా 6.40 శాతం నుంచి ప్రారంభమవుతుంది.

ఈ రుణం బ్యాంకుల చరిత్రలో అతి తక్కువ గృహ రుణ రేటు. కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకునే లేదా ఇప్పటికే ఉన్న రుణాన్ని బదిలీ చేసే కస్టమర్లకు కొత్త రేట్లు వర్తిస్తాయి. ఇందులో బ్యాలెన్స్ బదిలీ కూడా ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ 

బ్యాంక్ ఆఫ్ బరోడా రెండో స్థానంలో ఉంది. దీని వడ్డీ రేటు 6.50 శాతం నుంచి 7.85 శాతం వరకు ఉంటుంది. స్వయం ఉపాధి రుణదాతలకు వడ్డీ రేటు కూడా 6.50-7.85 శాతంగా నిర్ణయించారు. రుణం మొత్తంలో 0.25 శాతం నుంచి 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.8,500 నుంచి రూ.25,000 వరకు ఉంటుంది. ఒక లక్ష రుణానికి రూ.746-827 వరకు EMI చెల్లించాలి.

కోటక్ మహీంద్రా లోన్

కోటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేటు 6.55 శాతం నుంచి 7.25 శాతం వరకు ఉంటుంది. దీని ప్రాసెసింగ్ రుసుము లోన్ మొత్తంలో 0.25 శాతం నుంచి 1 శాతం వరకు ఉంటుంది. GST కూడా చెల్లించాల్సి ఉంటుంది. కోటక్ మహీంద్రా రూ. 1 లక్ష రుణంపై రూ.787 EMIని వసూలు చేస్తుంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వడ్డీ రేటు 6.60 శాతం నుంచి 7.60 శాతం వరకు ఉంటుంది. ICICI బ్యాంక్ వడ్డీ రేటు 6.70 నుంచి 7.55 శాతం వరకు ఉంటుంది. దీని ప్రాసెసింగ్ రుసుము 0.50 శాతం. లోన్ మొత్తంలో GST. EMIగా రుణదాత ఒక లక్ష రూపాయలకు రూ. 757, 809 వరకు చెల్లించాలి.

యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేటు 6.75 నుంచి 7.2 శాతం వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కోసం లోన్ మొత్తంలో 1% వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కనీసం రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఒక లక్ష లోన్‌కు EMI రూ. 760-787 వరకు ఉంటుంది. IDBI బ్యాంక్ వడ్డీ రేటు 6.75-9.90 శాతం వరకు ఉంటుంది. SBI టర్మ్ లోన్ వడ్డీ రేటు 6.75 నుంచి 7.30 శాతం వరకు నిర్ణయించారు.

Tags:    

Similar News