ATM Card: మీరు ఏ బ్యాంకు ఏటీఎం వాడుతున్నారు.. దాని గురించి ఈ విషయం తెలుసా..?
ATM Card: బ్యాంకులో ఖాతా తెరిచినప్పుడల్లా ఖాతాదారునికి పాస్‌బుక్‌తో పాటు డెబిట్ కార్డును అందిస్తారు.
ATM Card: బ్యాంకులో ఖాతా తెరిచినప్పుడల్లా ఖాతాదారునికి పాస్‌బుక్‌తో పాటు డెబిట్ కార్డును అందిస్తారు. దీని సహాయంతో ప్రజలు ATM ద్వారా నగదు తీసుకోవచ్చు. అయితే భారతదేశంలో టాప్ 10 డెబిట్ కార్డ్ లేదా ATM ప్రొవైడర్లు ఏవో ఈ రోజు తెలుసుకుందాం. డెబిట్ కార్డ్ ద్వారా ప్రజలు ATM మెషిన్ నుంచి నగదు తీసుకోవచ్చు. ATM నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవడానికి డెబిట్ కార్డ్ మాత్రమే అవసరం. మీరు తీసుకున్న నగదు మీ ఖాతా నుంచి కట్ అవుతుంది. ఒక నెలలో డెబిట్ కార్డ్ నుంచి నగదు విత్ డ్రా చేయడానికి పరిమితి ఉంటుంది. ఎక్కువ లావాదేవీలు చేస్తే అదపసే ఛార్జీ విధిస్తారు.
బ్యాంకుల ద్వారా డెబిట్ కార్డ్ హోల్డర్‌కు అనేక ఆఫర్‌లు ఉంటాయి. ఇవి బోనస్ పాయింట్‌లు, క్యాష్ బ్యాక్, ఉచిత బీమా కవరేజ్, సేకరించిన పాయింట్‌ల కోసం రిడీమింగ్ ఆప్షన్‌లని అందిస్తాయి. ఈ సందర్భంలో మీరు టాప్ కంపెనీ ATM తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఏదైనా బ్యాంక్‌లో ఖాతా తెరిచేటప్పుడు డెబిట్ కార్డ్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
భారతదేశంలోని టాప్ 10 డెబిట్ కార్డ్ ప్రొవైడర్లు
1. SBI డెబిట్ కార్డ్
2. ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్
3. HDFC డెబిట్ కార్డ్
4. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్
5. యెస్ బ్యాంక్ డెబిట్ కార్డ్
6. కోటక్ మహీంద్రా డెబిట్ కార్డ్
7.HSBC డెబిట్ కార్డ్
8. కెనరా బ్యాంక్ డెబిట్ కార్డ్
9. బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డ్
10. బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్