Ayushman Card: ఆయుష్మాన్ కార్డ్ ఎక్కడ ఉపయోగపడుతుంది.. దీనికి ఎవరు అర్హులు..?
Ayushman Card: కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. అందలో ఒకటి ఆయుష్మాన్ భారత్. దీని కింద ఎంపిక చేసిన హాస్పిటల్స్‌లో ఉచిత చికిత్స పొందవచ్చు.
Ayushman Card: కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. అందలో ఒకటి ఆయుష్మాన్ భారత్. దీని కింద ఎంపిక చేసిన హాస్పిటల్స్‌లో ఉచిత చికిత్స పొందవచ్చు. ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న ప్రజలు ఈ స్కీమ్ ద్వారా పెద్ద ఉపశమనం పొందుతారు. ఈ స్కీమ్ పేదప్రజలకు ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు రూ.5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. ఈ కార్డు కింద ఏ వ్యాధులకు పొందవచ్చు, ఎక్కడ చికిత్స చేయవచ్చు అనే వివరాలు తెలుసుకుందాం.
చికిత్స ఎక్కడ పొందాలి?
ఎవరైనా ఆయుష్మాన్ కార్డు కలిగి ఉంటే అతను దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కొన్ని జాబితా చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సను పొందవచ్చు. ఈ కార్డు ద్వారా కరోనా, క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, డయాలసిస్, మోకాలి, తుంటి మార్పిడి, కంటిశుక్లం, ఇతర వ్యాధులకు చికిత్స పొందవచ్చు.
ఎవరు అర్హులు
దీనిని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కచ్చా ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు, భూమిలేని వారు, షెడ్యూల్డ్ కులాలు, తెగకు చెందినవారు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారు, ట్రాన్స్‌జెండర్లు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు అర్హులవుతారు.
ఈ కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలి..?
ముందుగా అధికారిక వెబ్‌సైట్ mera.pmjay.gov.in కి లాగిన్ అవ్వాలి.
మీ మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని ఇక్కడ ఎంటర్ చేయాలి.
మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. తర్వాత మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
పేరు, మొబైల్ నంబర్, రేషన్ కార్డ్, ఇతర వివరాలను నింపాలి.
కుడి వైపున ఉన్న కుటుంబ సభ్యులపై ట్యాబ్ చేసి, లబ్ధిదారులందరి పేర్లను యాడ్ చేయాలి.
తర్వాత మీకు ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డును జారీ చేస్తుంది.
దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఉపయోగించవచ్చు.