Wheat Price: చపాతి చాలా ఖరీదు గురూ.. పెరిగిన గోధుమ పిండి ధరలు..!

Wheat Price: ఇప్పుడు సామాన్యుడికి చపాతి కూడా ఖరీదుగా మారింది. ప్లేట్ రోటీ కూడా ఖరీదుగా మారుతోంది.

Update: 2022-05-11 09:00 GMT

Wheat Price: చపాతి చాలా ఖరీదు గురూ.. పెరిగిన గోధుమ పిండి ధరలు..!

Wheat Price: ఇప్పుడు సామాన్యుడికి చపాతి కూడా ఖరీదుగా మారింది. ప్లేట్ రోటీ కూడా ఖరీదుగా మారుతోంది. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌ గోధమపిండిపై కూడా పడింది. పెరుగుతున్న గోధుమల ధర కారణంగా రిటైల్ మార్కెట్‌లో పిండి ఖరీదుగా మారింది. సగటు పిండి ధర కిలో రూ.32.91కి చేరింది. గత ఏడాది కాలంలో పిండి ధర దాదాపు 13 శాతం పెరిగింది. కాగా గతేడాది మే 8న కిలో పిండి రూ.29.14కు లభించింది. ఇప్పుడు రూ.32.91కి చేరింది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం పిండి ధర ఖరీదైనదిగా మారింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం పిండి గరిష్ట ధర కిలో రూ.59కి చేరుకుంది. కాగా కనిష్ట ధర కిలో రూ.22. మే 9న మైసూర్‌లో కిలో రూ.54, ముంబైలో కిలో రూ.49, చెన్నైలో రూ.34, కోల్‌కతాలో రూ.29, ఢిల్లీలో కిలో రూ.27కి లభిస్తోంది. రానున్న రోజుల్లో గోధుమల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2021-22 రబీ సీజన్‌లో గోధుమ ఉత్పత్తి తగ్గుతుందని అంచనా. ప్రభుత్వమే ఉత్పత్తి అంచనాను తగ్గించింది. ఈ ఏడాది వేసవి కాలం ముందుగానే రావడంతో ప్రభుత్వం ఉత్పత్తి అంచనాను 111.32 మిలియన్ టన్నుల నుంచి 105 మిలియన్ టన్నులకు తగ్గించింది.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) గోధుమలను అవసరమైతే OMSSద్వారా విక్రయిస్తుంది. తద్వారా మార్కెట్లో గోధుమలకు కొరత ఉండదు. కానీ ఈ సరఫరా అనేది నిరంతరంగా ఉండాలి. మార్కెట్‌లో గోధుమల రాక తక్కువగా ఉన్నప్పుడు FCI ఈ చర్య కారణంగా మార్కెట్‌లో గోధుమలకు కొరత ఉండదు. ద్రవ్యోల్బణం వల్ల రేట్లు కూడా ప్రభావితం కావు. అయితే బహిరంగ మార్కెట్‌లో గోధుమలను విక్రయించే విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. OMSS పథకం ద్వారా ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో సరఫరా, ధరలను నియంత్రిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ప్రకటన చేయకపోతే జూన్ నుంచి పిండి దాని ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 

Tags:    

Similar News