వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. తెలిస్తే వారెవ్వా అంటారు!
New Features In WhatsApp : ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి అతి తక్కువ టైంలో చేరువైన మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఇది ఎవరు కాదనలేని వాస్తవం.. ప్రతి ఒక్కరు ఇప్పుడు దీన్ని వాడుతున్నారు..
New Features In WhatsApp : ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి అతి తక్కువ టైంలో చేరువైన మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఇది ఎవరు కాదనలేని వాస్తవం.. ప్రతి ఒక్కరు ఇప్పుడు దీన్ని వాడుతున్నారు.. అయితే రోజురోజుకూ సరికొత్త ఫీచర్ అప్‌డేట్స్‌తో యూజర్లను మరింతగా ఆకర్షిస్తుంది ఈ యాప్.. తాజాగా ఆల్వేస్ మ్యూట్ బటన్, న్యూ ఐకాన్స్, కేటలాగ్ షార్ట్‌కట్, 130 ఎమోజీలు.. ఇలా ఫ్రెండ్లీ ఫీచర్లను తన అప్‌డేటెడ్ వెర్షన్‌లో పొందుపరిచింది.
కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే కొన్ని సార్లు వాట్సాప్ గ్రూప్ లలో చేరిపోతాం. మొహమటం కొద్ది అందులో నుంచి బయటకు రాలేము.. అయితే అందులోని సందేశాలను కనబడకుండా అనే మ్యూట్ ఆప్షన్ వాడుతుంటాం.. ఈ మ్యూట్ బటన్ లలో ఇప్పటివరకు 8 గంటలు, వారం, సంవ్సతరం మాత్రమే ఉండేవి.. అయితే ఇప్పుడు వీటికి తోడుగా 'ఫరెవర్' అనే బటన్ వచ్చింది. ఈ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే సదరు గ్రూప్ లోని సందేశాలు మిమల్నీ ఇక ఇబ్బంది పెట్టవు!
ఇక మనం ఇతురులతో చాట్ చేసే సమయంలో కొన్ని సార్లు ఎమోజీలని వాడుతుంటాం.. అది మన ఫీలింగ్ ని ఇతరులకు తెలియజేస్తోంది. అందుకే ఒకేసారి ఏకంగా 138 అట్రాక్టివ్ ఎమోజీలను వాట్సాప్ యాడ్ చేస్తోంది. అంతేకాకుండా మనం ఇతరులకి ఫోటోలని ,వీడియోలని సెండ్ చేసే క్రమంలో వాటిని ఎడిట్ చేసుకునే ఆప్షన్‌తో 'మీడియా గైడ్‌లైన్స్' అనే ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. వాటిపైన టెక్స్ తో పాటుగా స్టిక్కర్లను యాడ్ చేసుకోవచ్చు.
ఇక వాట్సాప్ లో అటాచ్‌మెంట్ అనే ఆప్షన్ లో ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, డాక్యుమెంట్, కెమెరా, గ్యాలరీ, ఆడియో, లొకేషన్, కాంటాక్స్ మాత్రమే ఉండేవి.. ఇప్పుడు వీటికి తోడుగా పేమెంట్, రూమ్ అనే కొత్త ఆప్షన్ లను జతచేసింది.ఇందులో పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట.. ఇక రూమ్ అనేఆప్షన్ పైన క్లిక్ చేస్తే నేరుగా ఫేస్‌బుక్ మెసెంజర్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్‌ను అనేబుల్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి ఈ ఫీచర్లు కొన్ని బీటా వెర్షన్ లలోనే పరిమితం కాగా, మరికొద్ది రోజుల్లో యూజర్లందరికీ అందించనుంది.