Fixed Deposit Interest Rates : ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా?
Fixed Deposit: ఈరోజుల్లో ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి వస్తాయా లేదా అనే డౌట్ ఉంటుంది. ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు అనుకునేవాళ్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మంచిది. కానీ వీటిపై కనీస అవగాహన ఉండాలి. ఎఫ్డీ చేయాలనుకునేవారు ఏ బ్యాంకులో ఎంత వడ్డీరేట్లు ఇస్తున్నాయి. అలా దేశంలో ప్రముఖ బ్యాంక్ లు ఇచ్చే రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Fixed Deposit: ఫిక్స్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల తమ డబ్బులకు ఎలాంటి రక్షణ ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా అలాంటి వారిని ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఆకర్షణీయంగా వడ్డీరేట్లతో డిపాజిటర్లు ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఎఫ్డీ చేయాలనుకునే వారికి ఆయా బ్యాంకులు అందించే ఆకర్షనీయమైన వడ్డీరేట్ల గురించి తెలుసుకుందాం.
కోటక్ మహీంద్రా బ్యాంక్:
కోటక్ మహీంద్రా బ్యాంకు 3ఏండ్ల కాల వ్యవధితో డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 7శాతం , సీనియర్ సిటిజన్లకు 7.6శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్:
ఐసీఐసీఐ బ్యాంక్ కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ తో మాదిరిగా మూడేండ్లు ఎఫ్డీలపై సాధారణ డిపాజిటర్లకు ఏడాదికి 7శాతం చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ అందిస్తుంది. 15నెలల నుంచి 2ఏండ్ల వ్యవధిగల డిపాజిట్లపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. సవరించిన వడ్డీ రేట్లు 2024 ఆగస్టు 10నుంచి అమల్లోకి వచ్చాయి.
ఎస్బీఐ:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడేండ్లకు గాను డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 6.75శాతం వడ్డీని చెల్లిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకు మాత్రమే 7.25శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. సవరించిన వడ్డీరేట్లు 2024 జూన్ 10 నుంచి అమల్లోకి వచ్చాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా:
బ్యాంక్ ఆప్ బరోడా ఎఫ్డీలపై అత్యధిక వడ్దీ రేటును అందిస్తుంది. సాధారణ డిపాజిటర్లకు 7.15శాతం వడ్డీ చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3 ఏండ్లకు ఎఫ్డీలపై 7.65వడ్డీని చెల్లిస్తుంది. సవరించిన ఈ వడ్డీ రేట్లు 2024 జులై 15నుంచి అమలవుతున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 3ఏండ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 7శాతం సీనియర్ సిటిజన్లకు 7.5శాతం వడ్డీ రేట్లను అందజేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కొంచెం ఎక్కువ రేట్లు అందిస్తుంది. ఎక్కువ వడ్డీ కావాలనేవారు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆకర్షణీయమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి.