Warning to SBI: ఎస్బీఐ ఖాతాదారులకి హెచ్చరిక.. ఆ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకూడదు..!
Warning to SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. 45 కోట్ల మంది ఖాతాదారులని కాపాడటానికి ఈ హెచ్చరిక జారీ చేసింది.
Warning to SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. 45 కోట్ల మంది ఖాతాదారులని కాపాడటానికి ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పుడు బ్యాంకు తరపున రెండు ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే లిప్ట్ చేయకూడదని సూచించింది. ఈ రెండు నెంబర్ల నుంచి కాల్ చేసి కస్టమర్లని మోసం చేస్తున్నారని తెలిపింది. ఈ రోజుల్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫిషింగ్ స్కామ్ నుంచి కస్టమర్‌లను రక్షించేందుకు బ్యాంక్ ఈ హెచ్చరికను జారీ చేసింది. ఫిషింగ్ మోసాలు SMS, ఈ-మెయిల్స్ ద్వారా ఎక్కువగా జరుగుతున్నాయి. కాల్ చేసినప్పుడు ఈ వ్యక్తులు SBI ఉద్యోగిగా నటిస్తూ కస్టమర్‌ని మోసం చేస్తున్నారు.
ఈ రెండు సంఖ్యలను గమనించండి 8294710946, 7362951973 అనే రెండు నంబర్ల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి అంటూ చాలామందిని మోసం చేస్తున్నారు. ఈ రెండు నంబర్ల నుంచి కాల్ వస్తే తప్పని రిసీవ్ చేసుకోవద్దని బ్యాంకు సూచిస్తోంది. ఈ నంబర్‌ల నుంచి కాల్ చేసిన వ్యక్తి కస్టమర్‌ని KYC కోసం అడుగుతాడు. మొబైల్‌లో పంపిన లింక్‌పై క్లిక్ చేయమని కోరుతాడు. తద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించి మోసానికి పాల్పడుతాడు. ఈ రెండు నంబర్లకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎటువంటి సంబంధం లేదు. ఈ రెండు నంబర్‌లపై ఐటీ సెక్యూరిటీ వెంటనే చర్య తీసుకుంటుందని తెలిపింది.
ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బూస్టర్ డోస్ పేరుతో ఫోన్ కాల్స్ చేసి ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ల టార్గెట్ వృద్ధులే. వీరికి ఫోన్ చేసి మాటలతో మాయచేసి బ్యాంకు వివరాలు తెలుసుకుంటున్నారు. అనంతరం ఖాతాలో ఉన్న డబ్బుని మొత్తం స్వాహా చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలపై వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత వివరాలు ఎవరితో షేర్ చేసుకోవద్దని గుర్తుంచుకోండి.