Vodafone Idea: వొడాఫోన్ ఐడియా సూపర్ పోస్ట్ పెయిడ్ ప్లాన్.. ఎయిర్‌టెల్, జియోల కంటే మరింత ఎక్కువ..!
Vodafone Idea: ఇండియాలో వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలు వినియోగదారులకు ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటుగా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.
Vodafone Idea: ఇండియాలో వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలు వినియోగదారులకు ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటుగా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే వీటిలో వోడాఫోన్ ఐడియా అన్నింటి కంటే ముందు వరుసలో ఉంది. Vi టెల్కో రూ.699 ధర వద్ద అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు ఎయిర్‌టెల్, జియోలతో పోలిస్తే మరింత ఎక్కువగా ఉన్నాయి.
వోడాఫోన్ ఐడియా (Vi) వినియోగదారులకు రూ.699 ధర వద్ద అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో అపరిమిత డేటాను పొందవచ్చు. దీంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు Vi యాప్, ZEE5 ప్రీమియం యొక్క ఆరు నెలల సబ్స్క్రిప్షన్ తో పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, Vi మూవీస్ & TV, హంగామా మ్యూజిక్ లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ఈ OTT ప్లాట్‌ఫారమ్‌లన్నింటి సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయడం కోసం వినియోగదారులు అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే ఈ ప్లాన్ ను కొనుగోలు చేయడంతో వీటిని ఉచితంగా పొందే అవకాశం ఉంది.
ఇంకా Vi రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను పొందుతారు. అంతేకాకుండా ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలకు 100 SMSలను అందిస్తుంది. జియో, ఎయిర్‌టెల్‌తో సహా ఇతర కంపెనీలు ఏవి కస్టమర్‌లకు ఇటువంటి ప్లాన్‌లను అందించడం లేదు. Vi టెల్కో అనేక రాష్ట్రాలు/సర్కిళ్లలో తన మొబైల్ నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తుంది. మార్చి, ఏప్రిల్ 2022లో ఢిల్లీ వంటి ప్రాంతాల్లో అత్యధిక మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగిన నెట్‌వర్క్‌గా నిలిచింది. వినియోగదారులు చాలా తక్కువ ఖర్చుతో ఈ ప్లాన్‌ని ఉపయోగించుకోవచ్చు.