Urgent Money: అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఈ ఆప్షన్ బెటర్.. అదేంటంటే..?
Urgent Money: మీకు డబ్బు అత్యవసరమైతే బ్యాంకు నుంచి సులువుగా పొందవచ్చు.
Urgent Money: మీకు డబ్బు అత్యవసరమైతే బ్యాంకు నుంచి సులువుగా పొందవచ్చు. దీనికోసం ఒక ఆప్షన్ ఉంది. మీ అకౌంట్‌ని బట్టి బ్యాంకు మీకు డిపాజిట్‌పై వడ్డీని ఇస్తుంది. బ్యాంకింగ్ లావాదేవీలలలో ఇది సాధారణ ప్రక్రియ. కానీ ఖాతాలో డబ్బు లేనప్పుడు కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకు తన ఖాతాదారులను అనుమతినిస్తుంది. డబ్బు అత్యవసరమైనప్పుడు మీరు ఈ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు. దీనినే 'ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం' అంటారు.
ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం నిజానికి ఒక రకమైన రుణం. దీని కారణంగా వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతా నుంచి ప్రస్తుత బ్యాలెన్స్ కంటే ఎక్కువ డబ్బును తీసుకోవచ్చు. ఇందులో విత్ డ్రా చేసిన మొత్తాన్ని నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించాలి. దీనిపై వడ్డీ కూడా చెల్లించాలి. వడ్డీ రోజువారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ఏదైనా బ్యాంకు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC)లు అందిస్తాయి. ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితి ఎంత అనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఇది వివిధ బ్యాంకులలలో వివిధ రకాలుగా ఉంటుంది.
కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లలో కొందరికి మొదటి నుంచే ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తాయి. అలాగే కొంతమంది వినియోగదారులు దీని కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దీని కోసం అప్లై చేసుకోవచ్చు. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కోసం దరఖాస్తు చేసే ముందు ప్రాసెసింగ్ ఫీజు గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. కొన్ని బ్యాంకులు ఈ సేవ కోసం ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తాయి.
ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం రెండు రకాలు
ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం రెండు రకాలు, సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్. సెక్యూర్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ అంటే దీనికింద ఏదైనా తాకట్టు పెట్టాలి. మీరు FD,షేర్లు, ఇల్లు, జీతం, బీమా పాలసీ, బాండ్లు వంటి వాటిపై ఓవర్‌డ్రాఫ్ట్ పొందవచ్చు. రెండోది మీకు ఏమీ లేకపోయినా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందవచ్చు. దీనిని అన్‌సెక్యూర్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ అంటారు. క్రెడిట్ కార్డ్ నుంచి విత్ డ్రా సౌకర్యం లాంటివి కల్పిస్తారు.