స్మార్ట ఫోన్ ప్రియుల కోసం హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా అత్యాధునిక టెక్నాలజీ కలిగిన మరో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. నోకియా కంపెనీ నిర్వహించిన ఒక ఈవెంట్ లో ఈ కొత్త ఫోన్ ల వివరాలను తెలియజేసింది.
నోకియా 8.2 స్మార్ట్ఫోన్లో స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 10,3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇంకా ఎన్నో అధునాతన ఫీచర్లను ఈ ఫోన్ ద్వారా అందించనుందన్నారు. ఇక మరో మోడల్ నోకియా 2.3 లో నోకియా 2.2ను పోలిన ఫీచర్లను అందించబోతోందని తెలిపారు. ఈ ఫోన్లను డిసెంబర్ 5వ తేదీన మార్కెట్ లో విడుదల చేయనున్నామని తెలిపారు. ఇక ఈ ఫోన్ మార్కెట్లోకి రాగానే ఎంత మంది మససుదోచుకుంటుందో, ఏ ధరతో మార్కెట్లో రానుందో డిసెంబర్ 5వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.