Gold Rates: ఇండియాలో బంగారం ధరలను నిర్ధేశించే 5 అంశాలు
Gold Rates: పురాతన రోజుల నుంచి బంగారానికి (GOLD) మన జీవితంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.
Gold Rates: పురాతన రోజుల నుంచి బంగారానికి (GOLD) మన జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు, బంగారం పెట్టుబడి అవసరాలకు, ఆభరణాల తయారీకి మాత్రమే కాకుండా, కొన్ని ఎలక్ట్రానిక్, వైద్య పరికరాల తయారీలో కూడా ఉపయోగించబడుతుంది.
ఇటీవల, గోల్డ్ దాని ప్రకాశాన్ని కోల్పోవడం ప్రారంభించింది. బంగారం ధరలు దిగజారిపోతున్నాయి. ధరలు మళ్లీ పెరిగినప్పుడు బంగారం నుంచి ప్రయోజనాలను పొందగలమనే ఆశతో వినియోగదారులు ఈ లోహాన్ని సేకరిస్తున్నారు.
ద్రవ్యోల్బణం
పెట్టుబడిదారులు కరెన్సీ కంటే బంగారాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సాధారణంగా, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు, బంగారం కోసం డిమాండ్ పెరుగుతుంది. లేదా దీనికి విరుద్ధంగా ఉంటుంది. కస్టమర్ల నుంచి అధిక డిమాండ్ ఉన్నందున బంగారం విలువ పెరుగుతుంది. ఇది అంతర్జాతీయ ద్రవ్యోల్బణాలతో పాటు భారతదేశంలోనూ జరుగుతుంది. కరెన్సీతో పోల్చితే దాని స్థిరమైన లక్షణం కారణంగా, బంగారం గణనీయమైన విలువను కలిగి ఉంది. అలాగే ద్రవ్యోల్బణాన్ని నిరోధించడానికి ఉపయోగిస్తారు.
బంగారు నిల్వలు: ప్రభుత్వం
ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ యూఎస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద అధిక శాతం బంగారం నిల్వలు ఉన్నాయి. పెద్ద దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారు నిల్వలను ఎక్కువగా కలిగి ఉండటం లేదా ఎక్కువ బంగారాన్ని సేకరించడం ప్రారంభించినప్పుడు, బంగారం ధర పెరుగుతుంది. అలాగే బంగారం సరఫరా తగ్గుతున్నప్పుడు మార్కెట్లో నగదు ప్రవాహం పెరుగుతుంది.
ప్రపంచవ్యాప్త కదలికలు
భారతదేశం అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా కదలికల కారణాంగా దిగుమతి చేసుకునే ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. అలాంటప్పుడు స్వదేశంలో బంగారం ధరలలో ప్రతిబింబిస్తుంది. బంగారాన్ని సంక్షోభ వస్తువుగా సూచిస్తారు. కొన్ని సమయాల్లో కరెన్సీ విలువ, వివిధ ఆర్థిక ఉత్పత్తులు పడిపోవచ్చు. అన్ని సమయాల్లోనూ బంగారంలో పెట్టుబడి సురక్షితమైందనే పెట్టబడిదారులు విశ్వసిస్తారు.
ఆభరణాల మార్కెట్
భారతీయులు తమ బంగారు ఆభరణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. పెళ్లిళ్ల సీజన్, దీపావళి వంటి పండుగల్లో.. వినియోగదారులు బంగారం కొనే డిమాండ్ పెరిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోతాయి. డిమాండ్-సరఫరాలో తేడాల వలన ధరల పెరుగుదలకు దారితీస్తుంది. టెలివిజన్, కంప్యూటర్, జీపీఎస్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వంటి పరికరాల తయారీకి బంగారాన్ని వివిధ ఎలక్ట్రానిక్ కంపెనీలు తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తాయి. ఇలాంటి కారణాల వల్ల బంగారం కోసం దేశీయంగా డిమాండ్ ఎంతగానో పెరుగుతుంది. అందువల్లే భారతదేశం ఎప్పటికప్పుడు బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకుంటుంది.
వడ్డీ రేట్ల పోకడలు
ప్రస్తుతం బంగారం ధరలు ఏ దేశానికైనా వడ్డీ రేట్ల పోకడలకు బంగారం రేట్లు గొప్ప సూచికలా పనిచేస్తాయి. వడ్డీ రేటుతో, వినియోగదారులు నగదును పొందేందుకు బంగారాన్ని అమ్ముతారు. బంగారం దిగుమతి పెరగడం వల్ల రేట్లు కిందకు దిగుతాయి. ప్రత్యామ్నాయంగా, తక్కువ వడ్డీ రేట్లతో కస్టమర్ల చేతికి ఎక్కువ నగదు అందుతుంది. అలాగే బంగారం కోసం ఎక్కువ డిమాండ్ పెరిగినప్పుడు ధర పెరుగుతుంది.
గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, బంగారం రేటును చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. డిమాండ్-సరఫరా ల మధ్య తేడాలతో బంగారం రేట్లలో తేడాలుంటాయి. ప్రాథమికంగా డిమాండ్-సరఫరాల మధ్య తేడాలే బంగారం ధరను పెంచే ప్రధాన కారణాలలో ఒకటి.