Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు పండగే...తులం బంగారం ఎంతంటే..?

Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే పసిడి ధర 600 రూపాయలు తగ్గింది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,400 పలుకుతుండగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,650 పలికింది. బంగారం ధరలు ధన త్రయోదశి నేపథ్యంలో భారీగా పెరుగుతున్నాయి.

Update: 2024-10-25 02:48 GMT

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు పండగే...తులం బంగారం ఎంతంటే..?

Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే పసిడి ధర 600 రూపాయలు తగ్గింది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,400 పలుకుతుండగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,650 పలికింది. బంగారం ధరలు ధన త్రయోదశి నేపథ్యంలో భారీగా పెరుగుతున్నాయి.

ముఖ్యంగా బంగారం ధర ఈ నెల ప్రారంభం నుంచి గమనించినట్లయితే దాదాపు 5 వేల రూపాయలు పెరిగింది. బంగారం ధర భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా ఉన్న కారణాలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. పసిడి ధరలు ఈ రేంజ్ లో పెరగడం కారణంగా ప్రతిరోజు రికార్డులను నమోదు చేస్తున్నాయి.

ఇప్పటికే బంగారం ధర 81 వేల ఎగువన రికార్డు స్థాయిని నమోదు చేసింది. అక్కడ నుంచి బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బంగారం ధర భారీగా పెరగడం వెనుక, అటు మనదేశంలో ఉన్న ఫెస్టివల్ సీజన్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రధానంగా ధన త్రయోదశి, దీపావళి సందర్భంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.

బంగారం ధరలు ప్రధానంగా పెరగడానికి ఇతర కారణాల విషయానికొస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అమెరికాలో ప్రస్తుతం బంగారం ధర ఒక ఔన్సు 2750 డాలర్లు పలుకుతోంది దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఈ ఏడాది ప్రారంభంలో 2000 డాలర్ల వద్ద మాత్రమే ఉంది. అక్కడ నుంచి బంగారం ధర ఏకంగా 750 డాలర్లు పెరిగింది.

బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున బంగారంలో పెట్టుబడులు పెట్టడం ఒక కారణంగా చెప్తున్నారు. . అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లపై నమ్మకం సన్న గిల్లడంతో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించిన ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పసిడి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అయితే బంగారం కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా బంగారం కొనుగోలు చేసే సమయంలో తూకం విషయంలోనూ, నాణ్యత విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. బంగారం ఎల్లప్పుడు హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు . అలాగే బంగారం కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బరువును చూడాలని చెప్తున్నారు. . ఒక మిల్లీగ్రామ్ తేడా వచ్చినా కూడా మీరు పెద్ద మొత్తంలో నష్టపోయి ప్రమాదం ఉంటుంది.

Tags:    

Similar News