Stock Market: నష్టాల బాటన దేశీ ఈక్విటీ మార్కెట్లు
Stock Market: వరుసగా రెండు సెషన్లలోనూ నష్టాల్లో మార్కెట్లు... * వారాంతపు సెషన్ లో లాభాల శుభారంభం...
Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు మరోమారు నష్టాల బాట పట్టాయి ..గత రెండు సెషన్లలో భారీ నష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు వారాంతపు సెషన్ లో లాభాల బాటన ట్రేడింగ్ ఆరంభించాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 212, నిఫ్టీ 46 పాయింట్లు మేర లాభాలను నమోదు చేశాయి. అయితే ఆరంభ లాభాలు అవిరి కావడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్ల మేర నష్టంతో 52,177 వద్దకు చేరగా నిఫ్టీ 59 పాయింట్ల మేర కోల్పోయి 15,632 వద్ద కదలాడుతున్నాయి.