Petrol and Diesel Price Today: దేశంలో మళ్లీ పెరిగిన చమురు ధరలు

*లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెంపు *ఆకాశాన్నంటుతున్న పెట్రోల్‌, డీజిల్ ధరలు

Update: 2021-10-11 04:27 GMT

దేశంలో మళ్లీ పెరిగిన చమురు ధరలు(ఫైల్ ఫోటో)

Petrol and Diesel Price Today: వాహనదారులకు మళ్లీ షాక్ తగిలింది. దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. దేశవ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీ క్రాస్‌ చేసి, నూట 10 రూపాయల దిశగా పరుగులు పెడుతున్నాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్ ధర నూట ఎమినిది రూపాయల 64 పైసలుగా కాగా డీజిల్ ధర నూటొక్క రూపాయి 65 పైసలుగా ఉంది. ఇక విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర నూట 10 రూపాయాల 39 పైసలకు పెరగగా డీజిల్‌ ధర నూట రెండు రూపాయల 74 పైసలకు చేరుకుంది. విశాఖలో పెట్రోల్ ధర నూట 10 రూపాయల 24 పైసలు కాగా డీజిల్ ధర నూట రెండు రూపాయల 57 పైసలుగా ఉంది.

అటు ప్రధాన నగరాల్లోనూ పెట్రోల్‌ ధరలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్​పెట్రోల్​ధర నూట 4 రూపాయల 14 పైసలు, కోల్‌కతాలో నూట 4 రూపాయల 80 పైసలు, ముంబైలో నూట 10 రూపాయల 12 పైసలు, చెన్నైలో నూటొక్క రూపాయి 51 పైసలుగా పెట్రోల్‌ ధర కొనసాగుతోంది.

Tags:    

Similar News