లాభాల జోరులో దేశీయ స్టాక్ మార్కెట్లు కళకళ
* కేంద్ర బడ్జెట్ కు తోడు గ్లోబల్ మార్కెట్ల సానుకూలత * వెరసి దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు * చరిత్రలో తొలిసారిగా 51వేల మార్కు దాటిన బీఎస్ఈ సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరు కొనసాగిస్తున్నాయి కేంద్ర బడ్జెట్ ఉత్సాహానికి తోడు గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారిగా బీఎస్ఈ సెన్సెక్స్ 51వేల మార్కును అధిగమించగా అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 15 వేల మార్కును క్రాస్ చేసింది. సెన్సెక్స్ 450 పాయింట్లు పెరిగి తొలిసారిగా 51,031మార్క్ ను టచ్ చేసింది. ఆర్‌బీఐ కీలక నిర్ణయాల వెల్లడి నేపధ్యంలో బెంచ్ మార్క్ సూచీలు దూకుడుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 243 పాయింట్ల లాభంతో 50,857 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 14,956 వద్ద కదలాడుతున్నాయి.