Gold Rate: పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Rate: 10 గ్రాముల బంగారం రూ.280, వెండి కేజీకి రూ. 1200 పెరిగాయి.
Gold Rate: గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నప్పటి మన దగ్గర మాత్రం ధరలు పెరుగూతనే వున్నాయి. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.42,650 ఉంది. నిన్నటి పోల్చితే 10 గ్రామలు బంగారం ధర ఏకంగా రూ.250 పెరిగింది. ప్రస్తుతం ఒక్క గ్రాము బంగారం ధర రూ.4,265గా ఉంది. పెట్టుబడుల్లో పెట్టే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,530 ఉంది. నిన్నటితో పోల్చితే రూ.280 పెరిగింది. ఒక్క గ్రాము నాణ్యమైన బంగారం ధర ప్రస్తుతం రూ.4,653 ఉంది.
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో...
హైదరాబాద్ 42,650, విశాఖ రూ.42,650, విజయవాడ రూ.42,650, చెన్నై 42,970, ముంబై 44,300, న్యూఢిల్లీ 44,800, కోల్‌కతా 44,630, బెంగళూరులో 42,630గా ఉంది
స్వల్పంగా పెరిగిన వెండి ధరలు...
నేడు వెండి ధరలు సైతం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.70,500గా ఉంది. నిన్నటి ధరలతో పోల్చితే కేజీ వెండి ధర 1,200 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి రూ.705గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.12 పెరిగింది. ఒక్క గ్రాము వెండి కావాలంటే రూ.70.50 చెల్లించాలి. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (10 గ్రాములు) ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో రూ.705, విశాఖలో రూ.705, విజయవాడలో రూ.705, చెన్నై రూ.705, ముంబై రూ.663, న్యూఢిల్లీ రూ.663, బెంగళూరు రూ.663గా నమోదయింది.