Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Price Today: నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. వెండి ధరలు కూడా పసిడి దారిలోనే పయనిస్తోంది.
Gold Price Today: దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని రోజుల నుంచి బంగారం ప్రియులకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇటీవల తగ్గుతూ వచ్చి ధరలు కాస్తా.. మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల 40వేలకు దగ్గరలో వచ్చిన ధరలు.. మళ్లీ 44 మార్క్ దాటాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై 110 రూపాయల మేర తగ్గింది. శనివారం 45,060 ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం.. ఈ రోజు ఆదివారం 44,950 గా ఉంది.
ప్రధాన నగరాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈ రోజు 46,250 గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 50,470 గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 44,950 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,950 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,600 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,660 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,770 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,840 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లో అత్యధికంగా పసిడి ధర 200 మేర తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,600 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.48,660 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,660 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,660 వద్ద కొనసాగుతోంది.
బంగారం బాటలోనే వెండి ధరలు...
పసిడి బాటలోనే వెండి కూడా భారీగానే పతనమైంది. ఆదివారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర శనివారం 68,900 ఉండగా.. ఆదివారం 68,700లు ఉంది. అంటే 200 రూపాయలు మేర తగ్గింది.
ప్రధాన నగరాల్లో ఉన్న ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,700 లుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.68,700 ఉంది. చెన్నైలో రూ.74,000 ఉంది. కాగా ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది. బెంగళూరులో రూ.68,700 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.68,700 వద్ద ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో రూ.74,000 లు ఉంది. విజయవాడలో వెండి రూ.74,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 25-04-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.