Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

Gold Price Today: నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Update: 2021-04-22 01:34 GMT

Gold Price Today:(File Image)

Gold Price Today: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి పసిడి ధరలు పెరిగాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,200 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.46,200గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో కూడా బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.46,590గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,810 ఉంది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,606 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,160గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,200 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ 46,200గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్ ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.44,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ రూ. 48,930 దగ్గరగా ఉంది. ఇక విజయవాడ, విశాఖ పట్నం మార్కెట్లలో కూడా బంగారం ధరలలో చేంజ్ కనిపిస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.44,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,930గా ఉంది.

స్థిరంగా వెండి ధరలు...

కరోనా పరిస్థితుల మధ్య గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆల్ టైం రికార్డ్ ధరలను నమోదు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే బంగారం ధరలు గురువారం ఉదయం మరోసారి పెరిగాయి. కానీ వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.688 ఉండగా.. కిలో వెండి రూ.68,800గా ఉంది.

ప్రధాన నగరాల్లో ఉన్న ధరలు...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.688 ఉండగా.. కేజీ ధర రూ.68,800కు చేరింది. అలాగే ముంబై మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.688 ఉండగా.. కిలో వెండి రూ.68,800గా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.739 దగ్గర ఉండగా.. కేజీ ధర రూ.73,900గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ పట్నం మార్కెట్లలో 10 గ్రాముల రేట్ రూ.739 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ 73,900కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట రూ.688 ఉండగా… కేజీ వెండి రూ.68,800గా ఉంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు 22-04-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.

Tags:    

Similar News