Gold Rate: పరుగులు పెడుతోన్న బంగారం, వెండి ధరలు

Gold Rate: బంగారం, వెండి ధరలు పెరగడంతో పసిడి ప్రియులకు భారీ షాక్ ఇస్తున్నాయి.

Update: 2021-04-20 01:11 GMT

Gold Rate:(File Image)

Gold Rate Today: దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న స్థిరంగా వున్న బంగారం ధరలు సాయంత్రానికి భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,070 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. రూ.46,070గా ఉంది. ఇదిలా ఉంటే… దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారంతో పోలీస్తే..మంగళవారం ఉదయం వరకు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.

దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు..

దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,400 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,620గా కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,950 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.49,030 ఉంది. ఇక ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,070 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ రూ.46,070గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.48,270కు చేరింది. అటు విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 22,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.48,270 ఉంది.

వెండి ధరలు..

దేశీయంగా పరుగులు పెడుతున్న పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.692 ఉండగా.. కిలో వెండి రూ.69,200 గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కూడా వెండి ధరలు పెరిగాయి.

వివిధ నగరాల్లో వెండి ధరలు...

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి దర రూ.742 ఉండగా.. కేజీ సిల్వర్ రూ.74,200గా ఉంది. అటు ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.692 ఉండగా.. కిలో వెండి రూ.69,200గా ఉంది. ఇక ముంబై మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రూ.692 ఉండగా… కిలో వెండి రూ.69,200గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో వెండి ధరలు కూడా హైదరాబాద్ మార్కెట్లోని ధరలనే పోలీ ఉన్నాయి. 10 గ్రాముల సిల్వర్ రూ.742 ఉండగా.. కిలో వెండి రూ.74,200గా ఉంది. అటు చెన్నై మార్కెట్లో 10 గ్రాముల వెండి రూ.742 ఉండగా.. కేజీ సిల్వర్ రూ.74,200గా ఉంది. రాబోయేది పెళ్ళిళ్ల సీజన్ కానుండడంతో.. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 20-04-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.

Tags:    

Similar News