Gold Rate: బంగారం, వెండి ధరలకు రెక్కలు

Gold Rate: బంగారం, వెండి ధరలు పెరగడంతో పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది.

Update: 2021-04-17 01:15 GMT

Gold Rate:(File Image)

Gold Rate Today: దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. గత పదిహేను రోజుల్లో ధరలు దేశీయ మార్కెట్‌లో 6 శాతం, అంతర్జాతీయ మార్కెట్లో 4 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఏకంగా 1775 డాలర్లను క్రాస్‌ చేసి 1800 డాలర్ల దిశగా పరుగెడుతోంది. కరోనా కారణంగా 2020 ఆగస్టులో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ పసిడి 2072, దేశీయ మార్కెట్లో రూ.56200 పలికింది. ఆ తర్వాత పతనమైనప్పటికీ, మళ్లీ ధరలు ఎగిసిపడుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 10 గ్రాములు రూ.44,000 ఉంది. నిన్న ధర కంటే రూ.300 పెరిగింది. తులం బంగారం ధర ప్రస్తుతం రూ.35,200 ఉంది. నిన్న ధర కంటే రూ.240 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,400 ఉంది. అలాగే పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.48,000 ఉంది. నిన్న ధర కంటే రూ.330 పెరిగింది. తులం బంగారం ధర రూ.38,400 ఉంది. నిన్న ధర కంటే రూ.264 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,800 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,900 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000వద్ద ఉంది. పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44, 000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

వెండి ధరలు..

దేశీయంగా పరుగులు పెడుతున్న పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గతంలో వెండి ధరలు తగ్గుముఖం పట్టినా.. మళ్లీ క్రమ క్రమంగా పరుగులందుకుంటోంది. తాజాగా శనివారం వెండి ధర భారీగా పెరిగింది. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా పెరుగుతోంది. అత్యధికంగా హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.1500 వరకు పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.68,500 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, కోల్‌కతాలో రూ.68,500 ఉంది. అలాగే బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, కేరళలో రూ.68,500 ఉంది. ఇక పుణెలో కిలో వెండి రూ.68,500 ఉండగా, హైదరాబాద్‌లో రూ.73,400 వద్ద కొనసాగుతోంది. ఇక ఏపీలోని విజయవాడలో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, విశాఖలో రూ.73,400 వద్ద ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 17-04-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.


Tags:    

Similar News