Gold Rate: జోరుమీదున్న బంగారం, వెండి ధరలు
Gold Rate: కరోనా కారణంగా బంగారం, వెండి ధరలు జోరందుకుంటున్నాయి.
Gold Rate: దేశంలో కరోనా కేసులతో పాటే బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. మరో వైపు స్టాక్ మార్కెట్లు పతనంవైపు నడుస్తాయి. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 10 గ్రాములు రూ.43,550 ఉంది. నిన్న ధర రూ.140 పెరిగింది. తులం బంగారం ధర ప్రస్తుతం రూ.34,840 ఉంది. నిన్న ధర రూ.112 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,355 ఉంది. అలాగే పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.47,510 ఉంది. నిన్న ధర రూ.150 పెరిగింది. తులం బంగారం ధర రూ.37,008 ఉంది. నిన్న ధర రూ.120 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,751 ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడలో ధరలు ఒకేలా ఉన్నాయి.
వివిధ నగరాల్లో...
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 కి చేరుకుంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది.
పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో…
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది.
వెండి ధరలు...
వెండి ధరలు కూడా సేమ్ బంగారం రూట్‌లోనే వెళ్తున్నాయి. అవి కూడా ఏప్రిల్ 1 నుంచి పెరుగుతూనే ఉన్నాయి. గత 12 రోజుల్లో వెండి ధర కేజీకి రూ.4,600 పెరిగింది. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.71,900 ఉంది. నిన్న ధర రూ.200 పెరిగింది. అలాగే... వెండి 8 గ్రాములు (తులం) కావాలంటే దాని ధర రూ.575.20 ఉంది. నిన్న 1.60 పెరిగింది. ఒక్క గ్రాము వెండి ధర రూ.71.90 ఉంది. గత 6 నెలలతో పోల్చితే... అప్పుడప్పుడూ తగ్గుతూ ఉన్నా... ఓవరాల్‌గా వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 6 నెలల కిందట అక్టోబర్ 14న వెండి ధర కేజీ రూ.62,000 ఉంది. ఇప్పుడు రూ.71,900 ఉంది. అంటే రూ.9,900 పెరిగింది. ఇప్పుడు వెండి కొనుక్కుంటే... ఎక్కువ ధర పెట్టి కొనుక్కున్నట్లే లెక్క.
గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 13.04.2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.