Gold Rate: తగ్గనంటోన్న బంగారం, వెండి ధరలు

Gold Rate: కరోనా కారణంగా బంగారం, వెండి ధరలు కొండెక్కుతున్నాయి.

Update: 2021-04-10 01:28 GMT

Today Gold Rate:(File Image)

Gold Rate: దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఎప్పుడైతే దేశంలో కరోనా కేసులు పెరుగుతూ... నైట్ కర్ఫ్యూలూ, వీకెండ్ లాక్‌డౌన్లు మొదలయ్యాయో... స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటాయనే ఉద్దేశంతో... ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు. ఫలితంగా ఈ వారంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారాయి. నిన్న కూడా స్వల్ప నష్టాలతోనే ముగిశాయి. ఇలా డబ్బును వెనక్కి తీసుకున్న వారు దాన్ని ఎందులో పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తూ... ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్న బంగారంపై పెట్టాలని భావిస్తున్నారు. దీని వల్ల బంగారం రోజు రోజుకు పెరుగుతూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది.

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.10 పెరిగి.. 45,160 గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 49,260 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 67,500గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 44,560 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,560 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,500 గా ఉంది.

కర్నాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,500 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,460 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 67,500 గా ఉంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,870 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,900 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,100గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,500 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.47,460 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,100 గా ఉంది.

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,460 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 72,100 గా ఉంది.

విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.47,460 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 72,100 గా ఉంది.


గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 10-04-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.

Tags:    

Similar News