Today Gold, Silver Rates: భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు
* పరుగులు పెడుతున్న పసిడి, వెండి ధరలు
Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పెరగడంతో పసిడి ధర రూ.47,780 కు చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.200 పెరుగుదలతో రూ.43,800 కు చేరింది. వెండి రేటు గురువారంతో పోలిస్తే కేజీకి 300 రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ.65,200 కు పెరిగింది.
దేశీయ మార్కెట్లో పసిడి ధర పెరగగా అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గడంతో ఔన్స్‌కు 0.22 శాతం దిగొచ్చి పసిడి రేటు ఔన్స్‌కు 1755 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా ఔన్స్‌కు 0.32 శాతం తగ్గడంతో 22.58 డాలర్లకు చేరింది.