Gold, Silver Price Today: పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చిన ధరలు
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. తాజాగా 10 గ్రాములపై 700 రూపాయలు తగ్గి బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చింది.
Gold Price Today: గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు శనివారం కాస్త ఊరటనిచ్చాయి. తాజాగా 10 గ్రాములపై 700 రూపాయలు తగ్గింది.
దేశంలోని వివిధ నగరాల్లో...
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,700 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,900 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,960 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,960 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,850 వద్ద ఉండగా, 24 క్యారెట్ల రేట్ రూ. 50,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,500 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,640 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లో బంగారం ధరలో భారీగా తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ ధర రూ. 45,500 గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,640 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,500 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,640 వద్ద కొనసాగుతోంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 45,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,640 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు...
దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. ఒకవైపు బంగారం ధరలు తగ్గా వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో...
దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర శుక్రవారంతో పోలిస్తే రూ. 1200 తగ్గి.. రూ. 70,800 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 70,800 గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,500 గా ఉంది. బెంగళూరులో శనివారం కిలో వెండి ధర రూ. 70,800 పలికింది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర శనివారం కిలో రూ. 75,500 ఉండగా, విజయవాడలో రూ. 75,500వద్ద కొనసాగుతోంది. విశాఖలో కిలో వెండి ధర రూ. 75,500 వద్ద కొనసాగుతోంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.