Gold Rate Today: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా?ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today : నేడు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోల్చి చూసినట్లయితే బంగారం ధర దాదాపు 100 రూపాయల చొప్పున పెరిగింది. హైదరాబాదులో నేటి పసిడి ధరలు గమనిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,350గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 67,350 వరకూ ఉంది.

Update: 2024-08-30 02:45 GMT

Today Gold Price: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా?ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: నేడు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోల్చి చూసినట్లయితే బంగారం ధర దాదాపు 100 రూపాయల చొప్పున పెరిగింది. హైదరాబాదులో నేటి పసిడి ధరలు గమనిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,350గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 67,350 వరకూ ఉంది.

బంగారం ధరలు పెరగడానికి ముఖ్యంగా అంతర్జాతీయ పరిస్థితులు కారణంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు శ్రావణమాసం కూడా ముగిసిపోతుంది. అయితే శ్రావణ ముగిసినప్పటికీ ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కానుంది. ఇక్కడ నుంచి దసరా దీపావళి షాపింగ్ ప్రారంభం అవుతుంది. దీంతో జనాలు బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే దసరా దీపావళి అనేది బంగారం మార్కెట్ కు అతిపెద్ద సీజన్ అని చెప్పవచ్చు. ధన త్రయోదశి ఇలాంటి పండగలు ఈ సీజన్లోనే ఉన్నాయి. సాధారణంగా కూడా బంగారం ధరలు ఈ సీజన్లో పెరుగుతూ ఉంటాయి.

దీనికి తోడు అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడానికి అమెరికాలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణంగా చెబుతున్నారు. సెప్టెంబర్ నెలలో అమెరికాలో నూతన డేటా విడుదల అవుతుంది.దీన్నిబట్టి బంగారం ధరలు నిర్ణయం జరగనుంది. గతంలో విడుదల చేసిన జాబ్స్ డేటాలో అమెరికా ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలింది. ఫలితంగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం అమెరికాను ఆర్థిక మాధ్యమం నుంచి గట్టెక్కించడానికి ఫెడరల్ రిజర్వు బ్యాంక్ సెప్టెంబర్ నెలలో జరిగే కీలక సమావేశాల్లో వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా పసిడి మార్కెట్ హెచ్చుతగ్గులను గమనిస్తే, అమెరికా సహా ప్రపంచ మార్కెట్లలో జరిగే పరిణామాలు బంగారాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ కారణంగానే బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి. అమెరికాలో కీలక వడ్డీ రేట్లు తగ్గించినట్లయితే యూఎస్ జారీ చేసే ట్రెజరీ బాండ్లపై వచ్చే బాండ్ యీల్డ్స్ తగ్గిపోతాయి. అప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని స్థిరమైన ఆదాయం ఇచ్చే బంగారం వైపు తరలిస్తారు. ఇదే గనుక సాగినట్లయితే బంగారం ధర మన దేశం మార్కెట్లో నూతన గరిష్ట స్థాయి రికార్డును తాకే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులో బంగారం ధర రూ. 80 వేల వరకూ చేరే అవకాశం ఉందని బులియన్ మార్కెట్లో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News