Gold Rate: డౌన్ ట్రెండ్ లో పట్టిన వెండి, బంగారం ధరలు
Gold Rate: వెండి, బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
Gold Rate: వెండి, బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు స్వల్పంగా రూ. 250 తగ్గాయి. నిన్ రూ. 41,350గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ.41,100గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,110గా ఉండగా, ఈ రోజు రూ.44,840గా ఉంది. ఇక ఈ రోజు వెండి రూ. 120 తగ్గింది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 తగ్గింది. దీంతో రేటు రూ.44,840కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.250 క్షీణతతో రూ.41,100కు తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,180ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,680గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,400ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,840 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 44,840 ఉంది.
వెండి ధరలు...
అటు వెండి ధరల విషయానికి వచ్చేసరికి వెండి ధరలు ఈ రోజు రూ. 120 తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.67,300గా ఉంది. చెన్నై, ,హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.67,300గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో రూ. 63,200, బెంగుళూరులో రూ. 65,500గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (01-04-2021 గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటాన్ని గమనించగలరు.