Multibagger Share: రూ.లక్ష పెట్టుబడిని.. రూ.4లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఏడాదిలోనే కళ్లు చెదిరే లాభాలు..!

Titagarh Wagons Limited Share Price: భారతీయ రైల్వేల కోసం కోచ్‌లను తయారు చేసే టిటాగర్ వ్యాగన్స్ లిమిటెడ్ స్టాక్ గత ఏడాది కాలంలోనే అద్భుతాలు చేసింది.

Update: 2023-06-22 06:32 GMT

Multibagger Share: రూ.లక్ష పెట్టుబడిని.. రూ.4లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఏడాదిలోనే కళ్లు చెదిరే లాభాలు..!

Titagarh Wagons Limited Share Price: భారతీయ రైల్వేల కోసం కోచ్‌లను తయారు చేసే టిటాగర్ వ్యాగన్స్ లిమిటెడ్ స్టాక్ గత ఏడాది కాలంలోనే అద్భుతాలు చేసింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ పెట్టుబడిదారులకు అద్భుతమైన ప్రయోజనాలను అందించింది. మంగళవారం ముగిసిన ట్రేడింగ్ సెషన్‌లో ఈ షేరు ఆల్ టైమ్ హై రూ.498.40కి చేరుకుంది. జూన్ 20, 2022న, ఈ షేర్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.93.35 వద్ద ఉంది. అంటే, ఈ స్టాక్ ఒక సంవత్సరంలో 400% కంటే ఎక్కువ పెరిగింది.

గత ఏడాది కాలంలో ఈ షేరు రూ.93.35 నుంచి రూ.498.40 వరకు పెరిగింది. అంటే ఏడాది కిందట ఈ షేర్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేసేవారు ఈరోజు రూ.4 లక్షలకు యజమానిగా మారేవారు. అతి తక్కువ సమయంలోనే ఈ స్టాక్ పెట్టుబడిని నాలుగు రెట్లు పెరిగింది. గత మూడేళ్లలో ఈ స్టాక్ 1241% బలమైన ర్యాలీని చవిచూసింది. జూన్ 19, 2020న స్టాక్ రూ.36.05 వద్ద ముగిసింది. ఈ సమయంలో రూ.498.40కి చేరింది.

ప్రస్తుత సంవత్సరంలోనే స్టాక్ 100 శాతం కంటే ఎక్కువ లాభపడింది..

సాంకేతిక పరంగా, ఈ స్టాక్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI) 84.9 వద్ద ఉంది. ఇది ఈ స్టాక్ ఓవర్‌బాట్ జోన్‌లో ట్రేడ్ అవుతుందని సూచిస్తుంది. ప్రస్తుత సంవత్సరంలో ఈ స్టాక్ 116%, ఒక నెలలో 46.81% లాభపడింది. వ్యాగన్ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న టిటాగర్ రైల్ సిస్టమ్స్ భారతదేశంలోని ప్యాసింజర్ రైలు వ్యవస్థల కొన్ని సమగ్ర తయారీదారులలో ఒకటిగా నిలిచింది.

(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం గత పనితీరును బట్టి అందించాం. అయితే, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి అనేది రిస్క్‌తో కూడుకున్నది. నిపుణుల సలహాలు తీసుకుని, సరైన నిర్ణయం తీసుకుని నష్టాల నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది)

Tags:    

Similar News