PF Account Number: మీ పీఎఫ్ ఖాతా నెంబర్‌లో ఈ సమాచారం దాగి ఉంది.. అదేంటో తెలుసా..?
PF Account Number: మీరు EPFO సబ్‌స్క్రైబర్ అయితే ఈ సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
PF Account Number: మీరు EPFO సబ్‌స్క్రైబర్ అయితే ఈ సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఉద్యోగి PF నంబర్ కలిగి ఉంటాడు. దాని నుంచి అతని PF ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. కానీ మీ పీఎఫ్ నంబర్‌లో చాలా ముఖ్యమైన సమాచారం దాగి ఉందని బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. PF ఖాతా నంబర్‌లో అంకెలతో కొన్ని ఆల్ఫాబెట్‌లు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.
PF ఖాతా నంబర్‌ను ఆల్ఫాన్యూమరిక్ నంబర్ అంటారు. దీనిలో ప్రత్యేక సమాచారం దాగి ఉంటుంది. ఆంగ్లంలో వర్ణమాలలు, అంకెలు కలిసి ఉంటాయి. ఈ నంబర్‌లో రాష్ట్రం, ప్రాంతీయ కార్యాలయం, స్థాపన (కంపెనీ), PF మెంబర్ కోడ్ వివరాలు ఉంటాయి.
ఉదాహరణకి ఇలా అర్థం చేసుకోండి.
XX – రాష్ట్ర కోడ్
XXX – రీజియన్ కోడ్
1234567 – ఎస్టాబ్లిష్‌మెంట్ కోడ్
XX1 – పొడిగింపు (ఏదైనా ఉంటే)
7654321 – ఖాతా నంబర్
EPFOలోని ప్రతి సభ్యునికి ప్రత్యేకమైన యూనివర్సల్ ఖాతా సంఖ్య (UAN) ఉంటుంది. ఉద్యోగి కంపెనీని మార్చినప్పుడు PF ఖాతా భిన్నంగా ఉన్నప్పటికీ UAN ఖాతా ఒకటే ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు ఒక UANలో మీ విభిన్న PF వివరాలను చూడవచ్చు.
మీరు ఇంట్లో కూర్చొని మీ PF బ్యాలెన్స్‌ని సులభంగా తనిఖీ చేయాలనుకుంటే మీరు SMS, మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి సమాచారాన్ని పొందవచ్చు. దీని కోసం మెసేజ్ బాక్స్‌లో EPFOHO UAN అని టైప్ చేసి 7738299899కి పంపండి. దీని తర్వాత మీ EPF బ్యాలెన్స్ మీ మొబైల్‌కి వస్తుంది. ఇది కాకుండా మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇచ్చి మీ పీఎఫ్ బ్యాలెన్స్ గురించి తెలుసుకోవచ్చు.