May Bank Holidays: మే లో 13 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఆర్బీఐ జాబితాని చెక్ చేయండి..!
May 2022 Bank Holidays: మే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే ఇప్పుడే దాని కోసం ప్లాన్ చేయండి...
May 2022 Bank Holidays: మే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే ఇప్పుడే దాని కోసం ప్లాన్ చేయండి. లేదంటే సమస్యలు ఎదుర్కోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 2022 సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం మే నెల నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రాష్ట్రాలు, అక్కడి జరుపుకునే పండుగలను బట్టి ఈ సెలవులు మారవచ్చు. ఆర్బీఐ బ్యాంకు సెలవుల జాబితాను నాలుగు విధాలుగా జారీ చేస్తుంది. ఈ జాబితా దేశవ్యాప్తంగా, రాష్ట్రాలలో జరుపుకునే పండుగల ఆధారంగా రూపొందిస్తుంది.
జాతీయ సెలవులు కాకుండా రాష్ట్రాల ప్రకారం కూడా కొన్ని సెలవులు ఉంటాయి. నివేదిక ప్రకారం మే నెలలో వివిధ జోన్లలో మొత్తం 31 రోజులలో 13 రోజులు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. కస్టమర్లు మేలో బ్యాంకుకు వెళ్లే ముందు అన్ని సెలవులను ఒక్కసారి చూసుకోవాలని అధికారులు తెలిపారు. మీ నగరం లేదా రాష్ట్రంలో ఏ రోజున బ్యాంకులు మూసి ఉంటాయో గమనించాలన్నారు.
మేలో బ్యాంక్ సెలవుల జాబితా
1 మే 2022: కార్మిక దినోత్సవం / మహారాష్ట్ర దినోత్సవం. దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు. అలాగే ఈ రోజు ఆదివారం కూడా దీంతో బ్యాంకులకి కచ్చితంగా సెలవు ఉంటుంది.
2 మే 2022: మహర్షి పరశురామ జయంతి - కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేస్తారు.
3 మే 2022: ఈద్-ఉల్-ఫితర్, బసవ జయంతి (కర్ణాటక)
4 మే 2022: ఈద్-ఉల్-ఫితర్, (తెలంగాణ)
9 మే 2022: గురు రవీంద్రనాథ్ జయంతి, త్రిపుర
14 మే 2022 : 2వ శనివారం
16 మే 2022న బుధ్ పూర్ణిమ, బ్యాంకు సెలవు
24 మే 2022 : ఖాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టినరోజు – సిక్కిం
28 మే 2022 : 4వ శనివారం బ్యాంకు సెలవు
మే 2022లో వారాంతపు బ్యాంకు సెలవులు
1 మే 2022 : ఆదివారం
8 మే 2022 : ఆదివారం
15 మే 2022 : ఆదివారం
22 మే 2022 : ఆదివారం
29 మే 2022 : ఆదివారం