FD Interest: ఈ చిన్న బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.15% వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.. అవేంటంటే..?
FD Interest: ఈ చిన్న బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.15% వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.. అవేంటంటే..?
FD Interest: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించిన తర్వాత జూలైలో రెండో సారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. దీంతో చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. అయితే సంప్రదాయ బ్యాంకులు 2 నుంచి 6 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కానీ మూడు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అద్భుత వడ్డీరేట్లని అందిస్తున్నాయి.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
6 నెలలు- 5.25 శాతం, సీనియర్ సిటిజన్లు - 5.75 శాతం
1 సంవత్సరం - 6.50 శాతం, సీనియర్ సిటిజన్లు - 7.00 శాతం
2 సంవత్సరాలు - 7.00 శాతం, సీనియర్ సిటిజన్లు - 7.50 శాతం
3 సంవత్సరాలు - 6.50 శాతం
5 సంవత్సరాలు– 6.75 %,సీనియర్ సిటిజన్లకు –7.25%
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
1 సంవత్సరం - 6.50 శాతం, సీనియర్ సిటిజన్లు - 7.30 శాతం
2 సంవత్సరాలు - 7.25 శాతం, సీనియర్ సిటిజన్లు - 8.05 శాతం
3 సంవత్సరాలు - 7.25 శాతం, సీనియర్ సిటిజన్లు - 8.05 శాతం
5 సంవత్సరాలు - 7.35 శాతం, సీనియర్ సిటిజన్లు - 8.15 శాతం
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
6 నెలలు - 4.75 శాతం, సీనియర్ సిటిజన్లు - 5.25 శాతం
1 సంవత్సరం - 6.70 శాతం, సీనియర్ సిటిజన్లు - 7.20 శాతం
2 సంవత్సరాలు - 7.10 శాతం, సీనియర్ సిటిజన్లు - 7.60 శాతం
3 సంవత్సరాలు - 6.25 శాతం, సీనియర్ సిటిజన్లు - 6.75 శాతం
5 సంవత్సరాలు - 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు - 6.50 శాతం