Aadhaar Works: ఆధార్ ఈ 3 పనులు జూన్‌లోనే పూర్తి చేయాలి.. లేదంటే తర్వాత చాలా కష్టం..!
Aadhaar Works: జూన్‌లో ఆధార్ కార్డుకి సంబంధించి కొన్ని పనులు కచ్చితంగా పూర్తి చేయాలి. లేదంటే తర్వాత చాలా కష్టమవుతుంది.
Aadhaar Works: జూన్‌లో ఆధార్ కార్డుకి సంబంధించి కొన్ని పనులు కచ్చితంగా పూర్తి చేయాలి. లేదంటే తర్వాత చాలా కష్టమవుతుంది. భారతదేశంలో ఆధార్ అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది లేకుండా దాదాపు ఏ పని సాధ్యం కాదు. ప్రభుత్వ పథకాలని సద్వినియోగం చేసుకోవాలన్నా, ఉద్యోగంలో చేరాలన్నా, పిల్లలని స్కూల్‌లో చేర్పించాలన్నా ప్రతి పని దీంతో ముడిపడి ఉంటుంది.10 ఏళ్ల క్రితం ఆధార్ కార్డును తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు దానిని అప్‌డేట్ చేయాలి. జూన్ నెలలో ఆధార్ కార్డుకు సంబంధించి కొన్ని పనులని పూర్తి చేయాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
పాన్-ఆధార్ లింక్
UIDAI చాలా రోజుల నుంచి పాన్, ఆధార్‌లను లింక్ చేయమని కోరుతోంది. ఒకవేళ లింక్ చేయకపోతే పాన్ కార్డును డియాక్టివేట్ చేస్తారు. పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ 30 జూన్ 2023గా నిర్ణయించారు. పాన్ కార్డు లేకుండా బ్యాంకింగ్ పనులు జరగవు. ఈ పరిస్థితిలో పాన్-ఆధార్ లింక్ చేయకపోతే వినియోగదారులు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పాన్ కార్డ్ డియాక్టివేట్ చేయడం వల్ల బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుంది.
ఆధార్ కార్డ్ అప్‌గ్రేడ్
ఆధార్ కార్డ్‌లో వ్యక్తుల పేరు, చిరునామా, ఫోటో, బయోమెట్రిక్ డేటా వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. డిజిటల్ ఇండియా కింద జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునే సదుపాయం కల్పించారు. UIDAI ప్రకారం myAadhaar పోర్టల్‌లో ఈ సేవ ఉచితం. గడువు తేదీలోగా ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే తర్వాత ఛార్జీ విధిస్తారు.
EPFO, ఆధార్ లింక్
జూన్ 1 నుంచి ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలలో మార్పు వచ్చింది. ఇకపై పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్‌కి ఆధార్ కార్డును లింక్ చేయాల్సి ఉంటుంది.