Fixed Deposits: ఈ 3 బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లని పెంచాయి.. ఎంతంటే..?

Fixed Deposits: ఆర్బీఐ వడ్డీరేట్లని పెంచిన తర్వాత చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లని పెంచుతున్నాయి.

Update: 2022-06-24 09:30 GMT

Fixed Deposits: ఈ 3 బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లని పెంచాయి.. ఎంతంటే..?

Fixed Deposits: ఆర్బీఐ వడ్డీరేట్లని పెంచిన తర్వాత చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లని పెంచుతున్నాయి. అందులో భాగంగా అతి పెద్ద ప్రైవేట్‌ దిగ్గజం ఐసీఐసీఐ కూడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. గత వారంలో బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం ఇది వరుసగా రెండోసారి. ఐసీఐసీఐ కాకుండా ఇండస్‌ ఇండ్‌, ఫెడరల్ బ్యాంక్ కూడా తమ వడ్డీ రేట్లను మార్చాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ఐసీఐసీఐ బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్లు జూన్ 22 నుంచి అమలులోకి వచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్‌లు ఇప్పుడు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్డీలపై 2.75 శాతం నుంచి 5.75 శాతం వడ్డీని పొందుతారు. సీనియర్ సిటిజన్లు ఇందులో 0.50 శాతం అదనపు వడ్డీ ప్రయోజనం పొందుతారు.

ఇండస్‌ఇండ్ బ్యాంక్

ఇండస్‌ఇండ్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మార్చింది. కస్టమర్‌లకు కొత్త రేట్లు జూన్ 21, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ కస్టమర్‌లు ఇప్పుడు 7 రోజుల నుంచి 61 నెలల వరకు FDలపై 3.25 శాతం నుంచి 6.50 శాతం వడ్డీని పొందుతారు. సీనియర్ సిటిజన్లు ఇందులో 0.50 శాతం అదనపు వడ్డీ ప్రయోజనం పొందుతారు.

ఫెడరల్ బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాగానే ఫెడరల్ బ్యాంక్ కూడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లని మార్చింది. కొత్త రేట్లు జూన్ 22, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్‌లు ఇప్పుడు 7 రోజుల నుంచి 75 నెలల వరకు FDలపై 2.75 శాతం నుంచి 5.95 శాతం వడ్డీని పొందుతారు. సీనియర్ సిటిజన్లు ఇందులో 0.50 శాతం కంటే ఎక్కువ అదనపు వడ్డీ ప్రయోజనం పొందుతారు.

Tags:    

Similar News