ఈ బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి కంటే ఎక్కువ వడ్డీ..!
FD Interest Rates: బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి అవకాశమని చెప్పాలి.
FD Interest Rates: బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి అవకాశమని చెప్పాలి. ఎందుకంటే రెండు బ్యాంకులు సూపర్ వడ్డీ చెల్లిస్తున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) కంటే అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి. యూనిటీ బ్యాంకు, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఖాతాదారులకి ఏకంగా 9 శాతం కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 4.5% నుంచి 9% వరకు వడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 9.5% వార్షిక వడ్డీ చెల్లిస్తోంది. ఇది 1001 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అందిస్తుంది. అలాగే రిటైల్ పెట్టుబడిదారులకు వడ్డీ రేటు 9%, సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4.5% నుంచి 9.5% వరకు వడ్డీ రేటును పొందుతారు.
- 1001 రోజుల డిపాజిట్‌పై 9.00% వడ్డీ (సాధారణ కస్టమర్‌లు)
- 1001 రోజుల డిపాజిట్‌పై 9.50% వడ్డీ (సీనియర్ సిటిజన్‌లు)
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4% నుంచి 9.1% వడ్డీని అందిస్తోంది. ఇది కాకుండా సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4.5% నుంచి 9.6% వరకు వడ్డీని పొందుతారు. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అధికారి ఒకరు మాట్లాడుతూ సాధారణ కస్టమర్లు 5 సంవత్సరాల డిపాజిట్‌పై 9.10% వడ్డీ రేటును పొందడం చాలా గొప్ప విషయమని తెలిపారు. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు ఈ వడ్డీ రేటు 0.5 శాతం ఎక్కువ అంటే 9.60% వడ్డీ రేటు లభిస్తుంది.
- 5 సంవత్సరాల కాలానికి 9.10% వడ్డీ రేటు (సాధారణ కస్టమర్లు)
- 5 సంవత్సరాల కాలానికి 9.60% వడ్డీ రేటు (సీనియర్ సిటిజన్‌లకు)