Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ విషయంలో కొత్త మార్పు.. ఇక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు..!

Driving License: వాహనాలు నడిపించాలంటే కచ్చితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. లేదంటే జరిమానాతో పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Update: 2024-01-10 07:30 GMT

Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ విషయంలో కొత్త మార్పు.. ఇక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు..!

Driving License: వాహనాలు నడిపించాలంటే కచ్చితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. లేదంటే జరిమానాతో పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌ లైసెన్స్ ఉంటేనే వెహికల్‌తో రోడ్డుపై వెళ్లాలి. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీ చేసే వివిధ రవాణా సంస్థలు ఉన్నాయి. ఇవి లైఫ్‌టైమ్ ఉండవు కొంత కాలానికి మాత్రమే జారీ చేస్తారు. తర్వాత వాటిని రెన్యూవల్‌ చేసుకోవాలి. సరైన సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుంటే దానికి ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటే ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం అందులో కొన్ని మార్పులు చేసింది. దాని గురించి తెలుసుకుందాం.

ఇంట్లో నుంచే లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయండి

ఇంతకు ముందు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తే ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లి ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉండేది. తర్వాత కూడా పని జరిగేది కాదు. రెండు మూడు సార్లు ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసింది. త్వరలో ఇది అమలులోకి రానుంది. దీనివల్ల వివిధ ప్రదేశాల్లో పనిచేస్తున్న వారికి సౌకర్యంగా ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌ ద్వారా ఎవరైనా ఎక్కడి నుంచైనా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పద్ధతి

లైసెన్సు రెన్యువల్ చేయాలంటే ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లోని ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఆన్‌లైన్ లైసెన్స్ రెన్యూవల్ సదుపాయాన్ని ప్రతిపాదించారు. ఇది కూడా ఇంకా అమలుకాలేదు. ఇది అమలులోకి వచ్చిన అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడుతారు. కానీ ప్రస్తుతం మాత్రం RTO కార్యాలయాన్ని సందర్శించి మాత్రమే లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News