SBI: ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్‌ ఖాతా తెరిస్తే అనేక సౌకర్యాలు..!

SBI: మీరు బ్యాంకులో సేవింగ్స్ ఖాతాను తెరవాలనుకుంటే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది.

Update: 2022-11-09 08:53 GMT

SBI: ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్‌ ఖాతా తెరిస్తే అనేక సౌకర్యాలు..!

SBI: మీరు బ్యాంకులో సేవింగ్స్ ఖాతాను తెరవాలనుకుంటే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జీరో బ్యాలెన్స్ సేవింగ్ ఖాతాను సులువుగా తెరవగలరు. దీని కోసం సమీప బ్రాంచ్‌ని సందర్శించాలి. అక్కడికి వెళ్లి ఫారమ్‌ను నింపి అకౌంట్‌ని ఓపెన్ చేయవచ్చు. ఎస్బీఐ ప్రతి బ్రాంచ్‌లో జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్‌ సౌలభ్యం ఉంటుంది. ఇందులో ఖాతా తెరవడానికి ఎలాంటి డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. ఈ ఖాతాలో ఉంచాల్సిన గరిష్ట మొత్తంపై పరిమితి లేదు.

KYC కలిగి ఉండటం అవసరం

వాస్తవంగా జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ పేద ప్రజల కోసం ప్రారంభించారు. అంతేకాదు ఈ ఖాతాలని జాయింట్‌ అకౌంట్‌గాకూడా మార్చుకోవచ్చు. అయితే చెల్లుబాటు అయ్యే KYC పత్రాలను కలిగి ఉండాలి. ఎలాంటి రుసుము ఉండదు. పొదుపు ఖాతా నుంచి మొత్తాన్ని విత్‌డ్రా చేయడానికి బ్యాంకు ఫారమ్‌ను పూరించాలి లేదా ATM ద్వారా తీసుకోవచ్చు. మీరు 1 నెలలో 4 సార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఆధార్ ద్వారా కూడా నగదు తీసుకోవచ్చు. ప్రాథమిక రూపే ATM-కమ్-డెబిట్ కార్డ్‌ను ఉచితంగా పొందుతారు. దీనిపై వార్షిక రుసుము లేదు.

బ్యాలెన్స్‌పై ఎటువంటి పరిమితి ఉండదు..

మీరు అకౌంట్‌లోని మొత్తాన్ని విత్‌డ్రా చేయాలనుకుంటే విత్‌ డ్రా ఫారమ్‌ ద్వారా తీసుకోవచ్చు. అలాగే ATM నుంచి నగదు తీసుకునే సౌలభ్యం ఉంటుంది. మరోవైపు మీ ఖాతాను 2 సంవత్సరాలు ఉపయోగించకుంటే ఖాతా డోర్‌మాట్ అవుతుంది. ఈ పరిస్థితిలో సరైన పత్రాలను సమర్పించడం ద్వారా సక్రియం చేసుకోవచ్చు. ఈ అకౌంట్‌ని ఉద్యోగులు, వ్యాపారులు, ఇతరులు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.

Tags:    

Similar News