Bank Loan: బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు చాలా ముఖ్యం.. అవేంటంటే..?

Bank Loan: బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు చాలా ముఖ్యం.. అవేంటంటే..?

Update: 2022-02-07 06:00 GMT

Bank Loan: బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు చాలా ముఖ్యం.. అవేంటంటే..?

Bank Loan: ప్రజలకి అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు అందరు బ్యాంకులపైనే ఆధారపడుతారు. లోన్ తీసుకొని వారి ఆర్థిక సమస్యలని పరిష్కరించుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ లోన్ డబ్బులు చెల్లించేముందు నానాతంటాలు పడాల్సి వస్తోంది. దీనికి కారణం లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలు తెలియకపోవడమే. అందుకే బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు ఒక్క వడ్డీరేట్ మాత్రమే కాదు చాలా విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని విషయాలపై ఓ లుక్కేద్దాం.

మొదటిది ప్రాసెసింగ్‌ ఫీజు ఇది ఒక్కో బ్యాంకుకి ఒక్కో విధంగా ఉంటుంది. ఇది లోన్ మొత్తంలో కొంత పర్సంటేజీ కావొచ్చు లేదా కొంత మొత్తం కావొచ్చు. ఒక్కోసారి అధిక ప్రాసెసింగ్ ఫీజు కారణంగా కస్టమర్ లోన్‌ తీసుకోవడానికి నిరాకరించడం లేదా వేరే బ్యాంకుకి మార్చుకోవడం జరుగుతుంది. లేదంటే ఈ ఫీజు వల్ల అతడి లోన్‌ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ప్రాసెసింగ్‌ ఫీజు ముందుగా తెలుసుకొని వడ్డీ రేట్లని పోల్చుకుంటే మంచిది. చాలా బ్యాంకులు ఆఫర్లు ప్రకటిస్తాయి కానీ అనేక నిబంధనలను విధిస్తాయి. సరైన పత్రాలు లేవని ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తాయి. దీనివల్ల బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లేదా లోన్ క్లోజ్ చేయడం లేదా లోన్‌ను పొడిగించడంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి లోన్ గడువు సమయంలో మీకు అనుకూలంగా ఉన్న బ్యాంకుని ఎంచుకుంటే మంచిది.

చాలా బ్యాంకులు మీకు మెరుగైన రేట్లకు లోన్లు అందిస్తాయి. తర్వాత అనేక ఖర్చుల గురించి తెలియజేస్తారు. బ్యాంకు సిబ్బంది ఇవన్ని ముందుగా చెప్పరు. ముందస్తు చెల్లింపు ఛార్జీలు, బ్యాలెన్స్ బదిలీ లేదా మీ లోన్ ధరను పెంచే విధంగా ఉంటాయి. కాబట్టి లోన్‌ తీసుకోవడానికి ముందు అసలు మొత్తం, వడ్డీ, ఫైన్‌, చెక్‌ బౌన్స్‌ తదితర ఛార్జీల గురించి తెలుసుకుంటే మంచిది. బ్యాంకులు జీరో ప్రాసెసింగ్‌ ఆఫర్లు ప్రకటించినప్పుడు లోన్‌ తీసుకుంటే మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. 

Tags:    

Similar News