Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇప్పుడు గ్రామాల నుంచి ఈ సేవలు..!

Indian Railway: రైల్వే ప్రయాణికులకి శుభవార్త. ఇప్పుడు టికెట్ల కోసం చింతవద్దు. మీ ఊరునుంచే టికెట్‌ పొందే సౌకర్యాన్ని ప్రారంభించింది.

Update: 2022-06-05 08:11 GMT

Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇప్పుడు గ్రామాల నుంచి ఈ సేవలు..!

Indian Railway: రైల్వే ప్రయాణికులకి శుభవార్త. ఇప్పుడు టికెట్ల కోసం చింతవద్దు. మీ ఊరునుంచే టికెట్‌ పొందే సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ప్రయాణికులు రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి స్టేషన్ లేదా ఏజెంట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని 45,000 పోస్టాఫీసుల్లో టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు రైల్వే ఏర్పాట్లు చేసింది.

ఈ విషయాన్ని ఇటీవల ఖజురహోలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇకపై రైలు టిక్కెట్లు తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. దీని కోసం రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 45,000 పోస్టాఫీసులలో టికెట్‌ కౌంటర్లని ఏర్పాటు చేసింది. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి టిక్కెట్లు తీసుకోవచ్చు. స్టేషన్‌కు దూరంగా ఉంటున్న ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్‌ కోసం ప్రజలు తిరగాల్సిన అవసరం లేకుండా పోస్టాఫీసుల్లో రైల్‌ రిజర్వేషన్‌ చేసుకునే వెసులుబాటును కల్పించింది.

ఈ పనిని శిక్షణ పొందిన పోస్టాఫీసు సిబ్బంది చేస్తారు. నెట్‌వర్క్ కనెక్టివిటీతో కూడిన హార్డ్‌వేర్‌ను రైల్వే అందించింది. ఈ పథకంతో నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ రైళ్లకు సమీపంలోని పోస్టాఫీసుల నుంచి రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటును పొందనున్నారు. అయితే ముందుగా, ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఈ -టికెటింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. నిరీక్షణ, పొడవైన క్యూల నుంచి విముక్తి కల్పించింది. దీని కింద రైల్వే ప్రయాణికులు UPI ఆధారిత మొబైల్ యాప్‌లైన Paytm, PhonePe, Freecharge వంటి వాటి నుంచి QR కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్‌లలో ప్రయాణ టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, నెలవారీ పాస్‌ల పునరుద్ధరణ కోసం డిజిటల్ చెల్లింపులు చేయగలుగుతారు. 

Tags:    

Similar News