EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి శుభవార్త.. ఈ నెలలోనే వడ్డీ జమయ్యే అవకాశం..!

EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకి ఇది శుభవార్తనే చెప్పాలి.

Update: 2022-07-08 08:56 GMT

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి శుభవార్త.. ఈ నెలలోనే వడ్డీ జమయ్యే అవకాశం..!

EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ప్రభుత్వం త్వరలో 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఖాతాలలో జమచేయనుంది. ఈసారి 8.1 శాతం వడ్డీ లభిస్తుందని అంచనా. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈపీఎఫ్‌వో 2022 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాలలోకి వచ్చే వడ్డీని లెక్కించింది. త్వరలో ఇది ఖాతాదారుల ఖాతాకు బదిలీ చేయనుంది.

గతేడాది వడ్డీ కోసం 6 నుంచి 8 నెలల పాటు నిరీక్షించాల్సి రావడం గమనార్హం. కానీ గతేడాది కోవిడ్ కారణంగా వాతావరణం భిన్నంగా ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం జాప్యం చేయదు. మీడియా నివేదికల ప్రకారం వడ్డీ డబ్బును జూలై 15 వరకు ఖాతాలలో బదిలీ చేయవచ్చు. ఈ ఏడాది వడ్డీ 40 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. మీరు బ్యాలెన్స్‌ తెలుసుకోవడానికి ఈ విధంగా ట్రై చేయవచ్చు.

1. ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. epfindia.gov.inలో ఈ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి.

2. ఇప్పుడు passbook.epfindia.gov.inకి న్యూ పేజీ ఓపెన్‌ అవుతుంది.

3. ఇక్కడ వినియోగదారు పేరు (UAN నంబర్), పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్‌ చేయండి.

4. అన్ని వివరాలను అందించిన తర్వాత మీరు మరో న్యూ పేజీకి వస్తారు. ఇక్కడ మీరు సభ్యుల IDని ఎంచుకోవలసి ఉంటుంది.

5. ఇక్కడ మీరు ఈ-పాస్‌బుక్‌లో మీ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ పొందుతారు.

Tags:    

Similar News