LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ ఎప్పుడు రాబోతుంది.. ఎవరికి లాభం ఉంటుంది..
LIC IPO: దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ గత కొద్ది రోజులుగా ఎల్‌ఐసీ ఐపీవో తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
LIC IPO: దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ గత కొద్ది రోజులుగా ఎల్‌ఐసీ ఐపీవో తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కస్టమర్లు, పాలసీదారులు దీనికోసం వెయిట్ చేస్తున్నారు. తాజా విషయం ఏంటంటే ఈ మార్చిలో షేర్ మార్కట్‌లో లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఈ త్రైమాసికంలో ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎల్‌ఐసి ఐపిఒ చాలా ముఖ్యపాత్ర పోషించనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.32,835 కోట్లు సమీకరించారు.
దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను పూర్తి చేసేందుకు గత సెప్టెంబర్‌లో ప్రభుత్వం 10 మర్చంట్ బ్యాంకర్లను నియమించింది. వీటిలో గోల్డ్‌మన్ సాక్స్, సిటీ గ్రూప్, నోమురా ఉన్నాయి. అంతేకాకుండా సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్‌ను న్యాయ సలహాదారుగా నామినేట్ చేశారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గతేడాది జూలైలో ఎల్‌ఐసీ పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇది ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద IPOగా అవతరించబోతుంది. ఏది ఏమైనా ఈ త్రైమాసికంలో తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఎల్‌ఐసీని లిస్టయ్యేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మోడీ ప్రభుత్వం తన ప్రైవేటీకరణ కార్యక్రమానికి మరింత ఊపు ఇవ్వాలనుకుంటోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) తన ప్రక్రియను మూడు వారాల్లోపు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ ప్రక్రియ సాధారణంగా 75 రోజులు పడుతుంది. ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను రాబోయే కొద్ది రోజుల్లో సెబీకి సమర్పించే అవకాశం ఉంది. ఏదిఏమైనప్పటికీ ఎల్‌ఐసీ ఐపీవో కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.