కేంద్ర ప్రభుత్వ ఆస్తుల అమ్మకం యధేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా నాలుగు మధ్య తరహా ప్రభుత్వ బ్యాంకులను ప్రయివేటీకరణ చేయాలని నిర్ణయించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఇండియాలు ప్రస్తుతం ప్రయివేటీకరణ లిస్ట్‌లో చేరాయి. ఈ నాలిగింటిలో రెండింటిని 2021 ఆర్థిక సంవత్సరంలోనే అమ్మేస్తారు. ప్రయోగాత్మకంగా ప్రస్తుతానికి మధ్య తరహా నుంచి చిన్న బ్యాంకులను మాత్రమే అమ్మాలని భావిస్తున్నారు.
రానున్న సంవత్సరాల్లో దేశంలో పెద్ద బ్యాంకులుగా ఉన్నవాటిని కూడా ప్రయివేటీకరించే ఆలోచనలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే స్టేట్ బ్యాంక్ ఇండియాలో మాత్రం ప్రభుత్వం తన మెజారిటీ వాటాలను అట్టే పెట్టుకుంటుంది. ఎందుకంటే రూరల్ ఏరియాల్లో రుణాలు ఇవ్వడం కోసం వ్యూహాత్మకంగా అతి పెద్ద బ్యాంక్ అవసరం గనుక దాన్ని అట్టే పెట్టుకోవాలని అనుకుంటోంది. కరోనా కారణంగా ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడటంతో దాన్ని పూడ్చుకోవడానికి పెట్రోల్ ధరలు పెంచుతోంది. అదే సమయంలో ప్రభుత్వ ఆస్తుల్ని కూడా భారీ ఎత్తున అమ్మకానికి పెడుతోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం.