Ration Card: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. వారికి ఉచిత రేషన్‌తోపాటు మరో భారీ ప్రయోజనం..!
Ration Card News Update: ఉచిత రేషన్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్ అందింది.
Free Ration Scheme Update: ఉచిత రేషన్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్ అందింది. మీరు కూడా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉచిత రేషన్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఇక నుంచి మీకు మరో భారీ ప్రయోజనం దక్కనుంది. ఈ మేరకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ పథకం ప్రకారం, అంత్యోదయ కార్డు హోల్డర్లు ఉచిత రేషన్‌తో పాటు ఉచిత చికిత్స సౌకర్యం కూడా పొందుతారు.
ఉచిత చికిత్స ప్రయోజనం..
అంత్యోదయ కార్డు హోల్డర్లందరికీ ఉచిత చికిత్స కోసం ఆయుష్మాన్ కార్డులను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జిల్లా స్థాయిలో జరుగుతున్న ప్రచారం మేరకు ప్రభుత్వం అనేక కేంద్రాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఇందులో రేషన్ కార్డు చూపించి ప్రజల సౌకర్యాల కేంద్రంలో ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంత్యోదయ కార్డుదారులకు ఆయుష్మాన్ కార్డులు తయారు చేసేందుకు ఆదేశాలు ఇచ్చారంట.
ఇప్పటికే పేరున్న వ్యక్తుల కోసం కార్డులు జారీ..
ప్రభుత్వం ఈ నిర్ణయం తర్వాత చికిత్సల కోసం అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్తగా ఆయుష్మాన్ కార్డులు తయారు చేయడం లేదంట. ఇప్పటికే జాబితాలో పేర్లు ఉన్న వారికే కార్డులు తయారు చేస్తున్నారు.