Ration Card: రేషన్‌ కార్డుదారులకి అలర్ట్‌.. వారికి అదనంగా గోధుమలు, బియ్యం..!

Ration Card: మీరు ఉచిత రేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగకరమైన వార్త.

Update: 2022-11-18 10:43 GMT

Ration Card: రేషన్‌ కార్డుదారులకి అలర్ట్‌.. వారికి అదనంగా గోధుమలు, బియ్యం..!

Ration Card: మీరు ఉచిత రేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగకరమైన వార్త. ప్రభుత్వం ఒక పెద్ద ప్రకటన చేసింది. దీని కింద కొంతమంది రేషన్‌ కార్డు హోల్డర్లకు 21 కిలోల గోధుమలు, 14 కిలోల బియ్యం అందించే పథకాన్ని ప్రారంభించింది. అంటే ఇవి అందరికి రావు. కేవలం అంత్యోదయ కార్డు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయి. అంత్యోదయ రేషన్ కార్డుదారులకు 21 కిలోల గోధుమలు, 14 కిలోల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. వీటివల్ల వినియోగదారులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. కరోనా కాలం నుంచి ప్రభుత్వం కోట్లాది మందికి ఉచిత రేషన్ సౌకర్యాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రజలు దీని ప్రయోజనాన్ని పొందుతున్నారు. రేషన్‌తో పాటు ఉప్పు, నూనె, పప్పు ప్యాకెట్లు అంత్యోదయ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందులో ఫస్ట్ కమ్ అండ్ ఫస్ట్ సర్వ్ అనే నిబంధనను పాటిస్తామని ప్రభుత్వం తెలిపింది.

లక్షల కార్డులు రద్దు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మంది ప్రజలు గరీబ్ కళ్యాణ్ యోజనను సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మంది రేషన్‌ కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. చాలా మంది అనర్హులు కూడా రేషన్ కార్డు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీని కారణంగా అనర్హులందరి కార్డులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News