Senior Citizens: కేంద్రం వృద్ధుల కోసం పెద్ద నిర్ణయం.. వారి భద్రత కోసం ఈ సదుపాయం..!
Senior Citizens: భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా వృద్ధుల కోసం ప్రత్యేక సదుపాయం ప్రారంభించింది.
Senior Citizens: భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా వృద్ధుల కోసం ప్రత్యేక సదుపాయం ప్రారంభించింది. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే కేవలం ఒక నంబర్‌కు కాల్ చేయవచ్చు. దేశంలోని సీనియర్ సిటిజన్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభించారు. PIB ట్వీట్ ద్వారా ఈ నంబర్ గురించి సమాచారాన్ని అందించింది. సీనియర్ సిటిజన్లకు పెన్షన్ సంబంధిత సమస్యలు, చట్టపరమైన సమస్యలు లేదా ఎలాంటి సహాయం కావాలన్నా ఎల్డర్ లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చని పిఐబి తన అధికారిక ట్వీట్‌లో రాసింది. ఇక్కడ మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
భారత ప్రభుత్వం ఆల్ ఇండియా టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 14567ను జారీ చేసింది. దీనికి 'ఎల్డర్ లైన్' అని పేరు పెట్టారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా సీనియర్ సిటిజన్‌లు వారి పెన్షన్, చట్టపరమైన విషయాలకు సంబంధించిన సమాచారాన్ని పొందగలుగుతారని తెలిపింది. కుటుంబ సభ్యులు వారిని పట్టించుకోకున్నా ఈ నెంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. నిరుపేద వృద్ధులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఈ హెల్ప్‌లైన్ ద్వారా సీనియర్ సిటిజన్‌లందరికీ సహాయం చేయడం, వారి ఆందోళనలను తొలగించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు అతని జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న సమస్యని కూడా పరిష్కరిస్తారు. అయితే ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను మొదట టాటా ట్రస్ట్‌లు ప్రారంభించాయి. 2050 నాటికి దేశంలో వృద్ధుల జనాభా 20 శాతానికి చేరుకుంటుంది. ఈ వయస్సులో అనేక రకాల సమస్యలు ఉంటాయి. శారీరక సమస్యల నుంచి మానసిక, భావోద్వేగ, న్యాయపరమైన సమస్యలు ఉంటాయి. ఈ హెల్ప్‌లైన్ ద్వారా సీనియర్ సిటిజన్‌లకు మెరుగైన సహాయం అందించడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.